Astrology: త్వరలో ఈ 5రాశులకు శుభయోగం.. వారిపై కనకవర్షం!!
జులై నెల చాలా ప్రత్యేకతను సంతరించుకున్న నెల. ఈ నెలలో సింహరాశిలోకి కుజుడు, సింహరాశిలోకి శుక్రుడు, కర్కాటక రాశిలోకి బుధుడు, కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచరిస్తారు. సింహ రాశిలో శుక్రుడు తిరోగమనం చెందుతాడు. ప్రధాన గ్రహాల సంచారం, తిరోగమనం వల్ల ద్వాదశ రాశుల వారి జాతకాలలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పరిణామాలు కొందరు జాతకులకు బాగా కలిసొస్తే, మరికొందరికి మిశ్రమంగానూ, ఇంకొందరికి నష్టదాయకంగాను ఉంటాయి.
అయితే జులై 4వ తేదీ నుండి కొన్ని రాశుల వారికి శుభ యోగం కనిపిస్తుంది. వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. కనక వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మేష రాశి, మిధున రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, మీన రాశి జాతకులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. జులై నెలలో పెండింగ్లో ఉన్న పనులన్నీ వారు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. సామాజికంగానూ మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. మిధున రాశి జాతకులకు జులై 4వ తేదీ నుండి అదృష్టం కలిసొస్తుంది. వారు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. మంచి కెరీర్ అవకాశాలు కూడా వారికి లభిస్తాయి. వారు ఏ పని చేయాలని భావించినా, ఆ పని విషయంలో అందరి మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి జాతకులకు జులై నెలలో బాగా ఉంది. వారు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ప్రమోషన్లు పొందుతారు. ధనుస్సు రాశి జాతకులకు జులై నెల లబ్ధిని చేకూరుస్తుంది. ధనుస్సు రాశి జాతకులు కెరీర్లో పురోగతిని సాధిస్తారు.
దీర్ఘకాలికంగా ప్రయోజనాలను ఇచ్చే ఒప్పందంలో ఈ సమయంలో ధనుస్సు రాశి వారు భాగస్వాములు అవుతారు. వృత్తిపరంగానూ విజయాలు సాధిస్తారు. మీన రాశి జాతకులకు జులై 4 నుండి బాగా కలిసి వస్తుంది వారు మంచి ప్రయోజనాలను చేకూర్చే ప్రభావవంతమైన వ్యక్తులతో సత్సంబంధాలను ఈ సమయంలో ఏర్పరచుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను ఈ నెలలో వారు పూర్తి చేసుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications