Astrology: జూన్ నెలలో 5ప్రధాన గ్రహాల సంచారంతో ఈ రాశుల వారి అదృష్టం మెరుస్తుంది!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు చాలా కీలకమైన పరిణామాలను కలిగి ఉంటాయి. వివిధ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులకు కారణమవుతాయి. జూన్ నెలలో ప్రతి రాశి చక్రం యొక్క ఫలితాలను మార్చే ఐదు ప్రధాన గ్రహాలు వివిధ రాశులలో కి సంచరించనున్నాయి.
ఈ సంవత్సరం జూన్ నెలలో మొత్తం ఐదు ప్రధాన గ్రహాలు కదలికలను కలిగి ఉన్నాయి. జూన్ 7వ తేదీన రాత్రి 7 గంటల 40 నిమిషాలకు బుధుడు వృషభ రాశి లోకి ప్రవేశిస్తాడు. ఇక జూన్ 15వ తేదీన సూర్యుడు 6 గంటల 7 నిమిషాల కు మిధునరాశి లోకి ప్రవేశించనున్నాడు.

జూన్ 17 వ తేదీన రాత్రి 10 గంటల 48 నిమిషాలకు శని తన సొంత రాశి అయిన కుంభ రాశి లోకి తిరోగమనం చేయనున్నారు. ఇక జూన్ 19వ తేదీన 11 గంటల 58 నిమిషాలకు వృషభ రాశిలో బుధుడు దహనానికి గురవుతాడు. అలా పోరాడి దహనానికి గురైన బుధుడు 24 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు మిధున రాశిలో ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం జూన్ లో ప్రధాన గ్రహాల కదలికలతో కొన్ని ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి, మిధున రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి వారికి జూన్ నెల లబ్దిని చేకూరుస్తుంది. వృషభ రాశి వారికి జూన్ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ నెలలో వృషభరాశి జాతకులు ఊహించని ఆర్థిక లాభాలను చూస్తారు.
వ్యాపారవేత్తలకు ఆర్థికవృద్ధి సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే వీలుంది. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి జూన్ నెల బాగా లాభిస్తుంది. సింహ రాశి జాతకులకు భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వెంచర్లకు ఇది అనుకూలమైన సమయం.
ధనస్సు రాశి వారికి జూన్ నెల బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో వీరు ధైర్యవంతులు గానూ, శక్తివంతులుగా ను కనిపిస్తారు. వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. మిధున రాశి జాతకులకు జూన్ నెల బాగా కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తులు కొనుగోలుకు సరైన సమయం. ఇంట్లో శుభకార్యాలకు కూడా ఇది సరైన సమయం..
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications