Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astrology: మార్చిలో ముఖ్య గ్రహాల సంచారం.. అన్ని రాశులపైనా ప్రభావం!!

2024 సంవత్సరం మార్చి మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మహా శివరాత్రి, హోలీ వంటి పండుగలు జరగనున్నాయి. ఈ మాసంలో ముఖ్య గ్రహాల రవాణా కొనసాగుతుంది. అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపించే విధంగా అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం మార్చి నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక మార్చి నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 Astrology: major planets transit in march.. Impact on all zodiac signs!!

ముఖ్యంగా మార్చి నెలలో ముఖ్యమైన గ్రహాల రవాణా జరగనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే మార్చి 7వ తేదీన కుంభరాశిలో శుక్ర సంచారం జరగనుంది. మార్చి 7వ తేదీన మీనరాశిలో బుధ గ్రహ సంచారం జరగనుంది. మార్చి 14వ తేదీన మీన రాశిలో సూర్య సంచారము కొనసాగనుంది.

మార్చి 15న మీనరాశిలో బుధుడు ఉదయించనున్నాడు. మార్చి 15వ తేదీన కుంభరాశిలో అంగారక సంచారం కొనసాగనుంది. మార్చి18వ తేదీన కుంభరాశిలో శని ఉదయించనున్నాడు. ఇక మార్చి 26వ తేదీన మేషరాశిలో బుధుడు సంచరించనున్నారు. మార్చి 31వ తేదీన మీనరాశిలో శుక్ర సంచారం జరగనుంది.

వేద జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన గ్రహాలుగా పరిగణించబడే ఈ గ్రహాల సంచారం మేషరాశి నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. మార్చి నెలలో జరగనున్న ముఖ్యమైన గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు లబ్ది జరిగితే, మరికొన్ని రాశులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల గమనం వివిధ రాశుల వారి జాతకాల పైన మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు కూడా దారితీస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+