Astrology:మకరరాశిలో కుజుడు: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి దురదృష్టం!!
జాతకంలో కుజుడు బలంగా ఉంటే జీవితంలో సంతోషంగాను, ఆరోగ్యంగానూ, బలమైన మనసును కలిగి ఉంటారు. కుజుడు బలహీనంగా ఉంటే పడరాని కష్టాలను పడతారు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక 2024 సంవత్సరంలో మకర రాశిలో కుజ సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంటే, మరి కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తోంది.
2024 ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి 9 గంటల 7 నిమిషాలకు మకర రాశిలో కుజుడు సంచరిస్తాడు. ఇక మకర రాశిలో కుజ సంచారం వల్ల ముఖ్యంగా రెండు రాశుల వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. మిధున రాశి వారికి మకర రాశిలో కుజ సంచారం అస్సలు కలిసి రాదు.

మిధున రాశిలో కుజుడు బలహీనమైన స్థానంలో ఉండడం వల్ల రుణ బాధలు పెరుగుతాయి. వ్యాధులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మకర రాశిలో అంగారక సంచారం వృత్తి జీవితంలో కూడా అనేక సవాళ్లకు కారణమవుతుంది. ఈ సమయంలో వ్యాపారాలలో లాభనష్టాలలో దేనికైనా అవకాశం ఉంది.
మకర రాశిలో కుజ సంచారం సమయంలో మిధున రాశి జాతకులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మిధున రాశి జాతకులు ఉద్యోగం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు, పేదలకు దానధర్మాలు చేస్తే ఈ ప్రతికూలతలు కాస్త తగ్గుతాయి.
మకర రాశిలో కుజ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. కర్కాటక రాశిలో కుజుడు బలహీనమైన స్థానంలో ఉండడం వల్ల ఆ రాశి జాతకులు వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
సహోద్యోగులతో గొడవలకు దిగకుండా సంయమనం పాటించాలి. ఈ సమయంలో మొండి వైఖరికి దూరంగా ఉండాలి. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి, సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్న ఆచితూచి వ్యవహరించాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications