Astrology: జులై1 నుండి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం 12 రాశుల వారికి అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఈ క్రమంలోనే జులై 1వ తేదీన కుజ గ్రహం సింహ రాశి లోకి ప్రవేశిస్తుంది. కుజుడు ఉగ్ర రూపానికి ప్రతీక. అయినప్పటికీ కుజుడు తన సొంతరాశి లోకి ప్రవేశించినపుడు శుభఫలితాలను ఇస్తాడు. కుజగ్రహం సింహ రాశి లోకి ప్రవేశించ టం వల్ల సింహ రాశి జాతకులకు అన్ని శుభాలే చేకూరుతాయి.
సింహ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. సమాజంలో పరువు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ముఖ్యంగా కుజ గ్రహ సంచారం వల్ల సింహ రాశి జాతకులకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. కుజ గ్రహ సంచారం వల్ల సింహ రాశి జాతకుల కెరీర్ సువర్ణ అవకాశాలతో కూడి ఉంటుంది. వారు విదేశాలకు వెళ్లడానికి అనేక అవకాశాలను పొందుతారు. సింహ రాశి జాతకులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కుజ గ్రహ సంచారం సింహ రాశి జాతకులకు అదృష్టాన్ని, ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినా జులై 1 నుంచి వీరికి బాగా లాభాలు వస్తాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి, కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి సింహ రాశి వారికి ఇది సరైన సమయం. కుజుడు సింహ రాశి జాతకులకు అన్నింటా విజయాలను అందిస్తాడు.
శత్రువులకు సైతం విస్మయం కలిగేలా అన్ని విషయాల లోనూ విజయాన్ని సాధిస్తారు. సింహ రాశి జాతకులు చేసే వ్యాపార ప్రయత్నాలకు కూడా కుజుడి ఆశీస్సులు ఉంటాయి. సింహ రాశి జాతకులకు ఈ కాలం అత్యంత లాభదాయకంగా, మంచి డెవలప్మెంట్ ను సూచిస్తూ సాగుతుంది. సింహ రాశి జాతకులకు కుజుడు గ్రహ సంచారం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది.

కుజ గ్రహ సంచారం వల్ల సింహ రాశి జాతకులు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుతుంది. అంతేకాదు జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను అనుభవించే సమయంగా దీనిని చెప్పవచ్చు .ఇంట్లో శుభకార్యాలను చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా గడపడానికి వీలుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications