• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

astrology: నవంబర్ లో పుట్టినవారిలో చాలా స్పెషల్ లక్షణాలు.. కానీ మైనస్ ఏంటంటే!!

|
Google Oneindia TeluguNews

పుట్టిన నెలను బట్టి మనుషుల లక్షణాలు ఉంటాయి. పుట్టిన నెల, తేదీ, సమయం, రాశి, తిథి వంటి అనేక అంశాలు మనుషుల వ్యక్తిత్వం పై ప్రభావం చూపిస్తాయి. ఇక నవంబరు నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారిలో ఉండే సహజసిద్ధమైన లక్షణాలు ఏంటి? వారిలో ఏ గుణాలు మంచివి? వారు మార్చుకోవాల్సినటువంటి గుణం ఏమిటి? వంటి అనేక ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నవంబర్ లో పుట్టినవారిలో స్పెషల్ ఇదే

నవంబర్ లో పుట్టినవారిలో స్పెషల్ ఇదే


నవంబర్ నెలలో పుట్టిన వారు సృజనాత్మకత ను కలిగి ఉంటారు. కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడతారు. ఇతరుల కంటే విభిన్నంగా ఆలోచించగలగడం వారిలో ఉండే గొప్ప లక్షణం. ఇక నవంబర్ లో పుట్టిన వారు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. నవంబర్ లో జన్మించిన వారు దాదాపుగా అందంగా ఉంటారు. నవంబర్ లో పుట్టిన వారికి పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. నవంబర్ లో పుట్టిన వారు ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు. వారు ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? వారికి తప్ప ఎవరికీ అర్థం కానట్టుగా ఉంటారు.

నవంబర్ లో జన్మించిన వారిలో ఈ లక్షణంతో చిక్కు

నవంబర్ లో జన్మించిన వారిలో ఈ లక్షణంతో చిక్కు


నవంబర్ లో జన్మించిన వారు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధ పెట్టరు కానీ వీరి మాటలు, చర్యలు ఒక్కొక్కసారి ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఒక్కొక్కసారి నవంబర్ లో జన్మించిన వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు. కొన్నిసార్లు అన్నింట్లోనూ తమదే పైచేయి గా ఉండాలని పట్టుబడతారు. నవంబర్ లో జన్మించిన వారికి కోపం ఎక్కువ, కొన్ని సందర్భాలలో తొందర పాటును ప్రదర్శిస్తారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి తొందర పడతారు. ముక్కు సూటిగా మాట్లాడి ఇతరులతో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఒక్కోసారి తమకు తెలియకుండానే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటారు.

అభిమానిస్తే వారి కోసం ఏమైనా చేస్తారు

అభిమానిస్తే వారి కోసం ఏమైనా చేస్తారు


నవంబర్ లో జన్మించిన వారికి కొందరికి అసూయపడే లక్షణం కూడా ఉంటుంది. ముక్కు సూటిగా మాట్లాడే తత్వంతో, అన్ని విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయంతో ఉండే వీరు ఎక్కడ ఉన్నప్పటికీ అందరి దృష్టి వారి పైన ఉండే లాగా ప్రవర్తిస్తారు. నవంబర్ లో జన్మించిన వారికి దేవుడిపై నమ్మకం ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంటూ అన్నిటినీ పాటిస్తారు. నవంబర్ లో జన్మించిన వారు వీళ్లను అభిమానించే వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. నవంబర్ లో జన్మించిన వారిని పొరపాటున రెచ్చగొడితే వారి ఆగ్రహానికి బలి కావాల్సిందే.

నవంబర్ లో జన్మించిన వారితో స్నేహం ఎలా ఉంటుందంటే

నవంబర్ లో జన్మించిన వారితో స్నేహం ఎలా ఉంటుందంటే


నవంబర్ లో జన్మించిన వారికి త్యాగం చేసే గుణం, సహాయం చేసే స్వభావం ఉంటాయి. నవంబర్ లో జన్మించిన వారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఇక నవంబర్ లో జన్మించిన వారితో స్నేహం నమ్మదగినది. వారు స్నేహానికి చాలా విలువ ఇస్తారు. నవంబర్ లో జన్మించిన వారు నమ్మిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ మోసం చేయరు. నవంబర్ నెలలో పుట్టిన వారికి శక్తిసామర్థ్యాలు, ఆకర్షణ శక్తి, తెలివితేటలు ఉంటాయి. కానీ ఒక్కోసారి వాటిని సక్రమంగా వినియోగించరు.

నవంబర్ లో జన్మించిన వారు ఇలా ఉంటే మంచిది

నవంబర్ లో జన్మించిన వారు ఇలా ఉంటే మంచిది


ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో చేసిన అనేక తప్పులు వల్ల ఇబ్బందులు పడతారు. కొన్ని సందర్భాలలో ఇతరులను అభిమానించి మోసపోతారు. చాలా సందర్భాలలో ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు. అదే వీరికి మైనస్ అవుతుంది. ఇక ఆవేశంలో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే నవంబర్ లో జన్మించిన వారు మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు. నవంబర్ నెలలో జన్మించిన వారికి సోమవారం శుక్రవారం రెండు రోజులు బాగా కలిసొస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు వారికి అదృష్టాన్నిచ్చే రంగులు. నవంబర్ లో జన్మించిన వారు దాదాపు ఆరోగ్యంగానే ఉంటారు. ఒకవేళ మీరు అనారోగ్యం పాలైతే కిడ్నీ సంబంధిత మైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

astrology: అక్టోబర్ నెలలో పుట్టిన వారిలో సూపర్ క్వాలిటీస్.. వారి జీవిత లక్ష్యం ఇదే!!astrology: అక్టోబర్ నెలలో పుట్టిన వారిలో సూపర్ క్వాలిటీస్.. వారి జీవిత లక్ష్యం ఇదే!!

English summary
People born in November have many special qualities. But speaking bluntly and taking angry decisions without understanding is a minus for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X