Astrology: శ్రవణ నక్షత్రంలో సూర్య సంచారం: ఈ రాశులకు లక్ష్మీకటాక్షం!!

శ్రవణ నక్షత్రంలో సూర్య సంచారం జనవరి 24వ తేదీన జరగనుంది. పురాణాల ప్రకారం 22వ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం మకరరాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే మకరరాశిలో సంచరిస్తున్న సూర్యుడు శ్రవణ నక్షత్రంలో కూడా సంచరిస్తాడు. ఈ ఖగోళ దృగ్విషయం కొన్ని రాశుల వారికి శుభాలను తెస్తుంది. వారికి లక్ష్మీ కటాక్షం కలిగేలా చేస్తుంది.

మేషరాశి:శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారం మేషరాశి వారికి ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సంవత్సరం శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారంతో వీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. నిరుద్యోగ వ్యక్తులు ఉపాధిని పొందగలరు . ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో సానుకూలంగా ఉండాల్సిన సమయం .

Astrology: Sun Transit in Sravana Nakshatra: Lakshmi blessings for these signs!!

కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారం మంచి ఆర్ధిక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో మీలో ధైర్యం, బలం పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల నుండి కూడా ప్రయోజనం ఈ సమయంలో చేకూరుతుంది.

కన్యా రాశి :శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారం కన్యా రాశి వారికి మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు. న్యాయపరమైన, విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. సామాజిక గుర్తింపు వస్తుంది. కన్యా రాశి వారి ప్రతిష్ట మరియు ఆత్మ గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వోద్యోగులు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు.

తులా రాశి :తులా రాశి వారికి శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఆర్ధిక పరంగా అన్ని విషయాలలో కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఉద్యోగం చేసుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది. న్యాయపరమైన సమస్యలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి.

మకర రాశి :మకర రాశి వారికి శ్రవణా నక్షత్రంలో సూర్య సంచారం బాగా కలిసొస్తుంది. మీరు చేసే పనికి ఈ సమయంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసొస్తుంది. వృత్తిపరమైన రంగాలలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+