జులై 16వరకు ఈ రాశులవారు ఈ విషయాల్లో జాగ్రత్త!!
ఈ వారం రెండు ప్రధాన గ్రహాల సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేసే మార్పులు వారి జాతకాలలో కనిపిస్తాయి . ఈ వారం కర్కాటక రాశి జూలై 14వ తేదీన బుధుడు ఉదయిస్తాడు. అంతేకాదు గ్రహాల రాజు అయిన సూర్యుడు జూలై 16వ తేదీన ఉదయం 4 గంటల 49 నిమిషాలకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు.
ఈవారం వివిధ రాశుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మేష రాశి వారికి ఈ వారం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చిన అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించబడింది. ఇంటి నివారణతో సమయాన్ని వృధా చేస్తే తీవ్రమైన అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

వృషభ రాశి వారికి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, మద్యపాన వ్యసనానికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఓం హనుమతే నమః అని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల ఈ వారి జాతకంలో కలిగే ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
సింహరాశి జాతకులు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ సమయంలో కృషి చేయాలి. అంతేకాదు ఎవరైనా కార్యాలయం నుండి విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంది కాబట్టి నష్టం జరిగొచ్చు. వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండటమే మంచిది. ఇక కొన్ని వృత్తిపరమైన, చట్టపరమైన ఇబ్బందుల కారణంగా సమస్యలను ఈ వారం ఎదుర్కొంటారు. అందుకే సింహరాశి జాతకులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి వారి ఈ వారం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. ఈవారం కన్యా రాశి వారి కార్యాలయంలో సహోద్యోగులు మోసం చేయవచ్చు. దీనివల్ల కన్యారాశి జాతకులకు ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కన్యా రాశి జాతకులు ఈ వారం జాతకంలో ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు పోవడానికి ప్రతిరోజు 11సార్లు ఓం బుధాయ నమః అని జపించాలి.
మీన రాశి వారికి ఈ వారం జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. మీన రాశి జాతకులు ఈ వారం అతిగా మద్యం సేవించి, వేగంగా డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరించబడింది. ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బు నష్టం జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కనుక మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications