Astrology: నేడు ఈ రాశులవారి కోరికలు నెరవేరతాయి; సిద్ధ యోగంతో వారికి అదృష్టం!!
నవగ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించడం వల్ల యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభమైనవిగాను, మరికొన్ని అశుభ యోగాలుగానూ ఉంటాయి. జూన్ నెలలో ఐదు ప్రధాన గ్రహాల సంచారం వల్ల వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి యోగాలలో సిద్ధ యోగం ఒకటి. సిద్ధ యోగం ఒక శుభమైన యోగం. ఇది అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన యోగాలలో ఒకటిగా చెప్పబడింది. నేడు సిద్ధ యోగం ఏర్పడుతుంది.
సిద్ధ యోగం సమయంలో ఏ పని చేసిన సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. సిద్ధ యోగం అన్న పదంలోని సిద్ది ఉంది. సిద్ధి అంటే ఏదైనా పని చేయడంలో విజయం సాధించడం. అందుకే సిద్ధ యోగం కొన్ని రాశిచక్ర జాతకుల మనసులో అనుకున్న అన్ని పనులను కచ్చితంగా అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి సిద్ధ యోగం నేడు ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార సిద్ది ని కలిగిస్తుంది.

వృషభ రాశి, మిధున రాశి, కన్యారాశి జాతకులు సిద్ధ యోగం కారణంగా అనుకున్న అన్ని పనులు సాధిస్తారు. వృషభ రాశి జాతకులకు సిద్ధయోగం బాగా కలిసొస్తుంది. వారు సిద్దయోగం సమయంలో ఏదైనా వాహనాన్ని లేదా ఆస్తిని కొనుగోలు చేయాలంటే అది ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా వ్యాపార ఒప్పందంపైన, భాగస్వామ్య ఒప్పందంపైన అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ యోగం ఎంతగానో అనుకూలిస్తుంది. శుభవార్తలు వింటారు.
ఇక కన్యారాశి జాతకులకు సిద్ధయోగం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వారికి విదేశాల నుండి పెద్ద ప్రాజెక్టులు మంచి అవకాశాలు వచ్చే వీలుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు. విదేశాలలో స్థిరపడటానికి కూడా ఇదే మంచి సమయం. వీసా కోసం ఎదురు చూసే వారికి, ఈ యోగం మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది. వీసా వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు సిద్ధ యోగం కారణంగా తమ వృత్తిలో రాణిస్తారు.
ఇక మిథున రాశి జాతకులపై సిద్ధ యోగం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఇది సరైన సమయం. మిధున రాశి వారికి సిద్ధ యోగం కారణంగా ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంక్రిమెంట్లు, బోనస్లు వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications