Astrology: జనవరి నెలలో ప్రధాన గ్రహాల సంచారం.. మీ జాతకాలు మారనున్నాయ్!!
2024 సంవత్సరం జనవరి మాసం.. ఈ ఏడాది మొదటి మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మనం అత్యంత ఇష్టంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వస్తుంది. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వాదశ రాశుల వారి జాతకాలలో గ్రహాల రవాణా కారణంగా అనేక సానుకూల, ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి.
ఇక ఈ ఏడాది మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం జనవరి నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక జనవరి నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జనవరి 2024లో జరిగే గ్రహ సంచారాలు శుభ ప్రారంభాలుగా చెప్పవచ్చు. జనవరి నెలలో బుధుడు జనవరి 2 వతేదీన వృశ్చిక రాశిలోకి రవాణా అయ్యాడు. మళ్ళీ జనవరి 7 వ తేదీన ధనుస్సు రాశిలోకి చేరతాడు. ధనుస్సు రాశిలోకి బుధుడి సంచారం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.
ఈ నెల మధ్యలో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, జనవరి 15 వ తేదీన సూర్యుడు మకరరాశిలోకి ప్రయాణం చేస్తాడు. ఈ పరిణామం కూడా అనేక రాశుల వారికి సానుకూల మార్పులకు కారణం అవుతుంది. జనవరి 16 న ధనుస్సు రాశిలో కుజుడు ఉదయిస్తాడు. ఇక జనవరి 18 వ తేదీన కుజుడు ధనుస్సు రాశిలో ఒక అద్భుత యోగాన్ని ఏర్పరుస్తాడు.
జనవరి 18న కుజుడు శుక్రుడుతో అక్కడ కలిసి ఉంటాడు. దీనివలన లక్ష్మీ నారాయణ రాజయోగంగా పిలువబడే ఖగోళ సంఘటన చోటు చేసుకుంటుంది. దీనివలన వృశ్చిక రాశి, కన్యా రాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. జనవరి నెలలో ఇలా గ్రహాల మార్పుల కారణంగా మేష రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, వృశ్చిక రాశుల వారికి శుభాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications