ఆగస్టు నెలలో ధనవంతులవుతున్న రాశుల వివరాలు

వచ్చేనెల ఐదోతేదీ వరకు బుధుడు సింహరాశిలో తిరోగమన దిశలో ఉంటాడు. అనంతరం 16వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే అదే నెల 25వ తేదీన శుక్రుడు కన్యారాశిలోకి, కుజుడు మిథునరాశిలోకి సంచారం చేస్తారు. నాలుగు గ్రహాలు ఆగస్టు నెలలో సంచారం చేస్తుండటంవల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలగడంతోపాటు శుభ పరిణామాలు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఎవరు, వారికి ఏ విధంగా కలిసిరానుంది అనే విషయాలను తెలుసుకుందాం.

సింహ రాశి
నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. ఆస్తికి సంబంధించిన విషయంలో న్యాయపరంగా ఉన్న వివాదాలన్నీ సానుకూలంగా పరిష్కారమవుతాయి. మానసికంగా ఎంతో దృఢంగా ఉండటమే కాకుండా జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా జీవిస్తారు. ప్రతి పనిలో అదృష్టం తోడుగా ఉండటంవల్ల విజయాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.

august month lucky zodiac signs details they will get more money

మకర రాశి
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పూర్వీకుల నుంచి వారసత్వ ఆస్తి లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఆగస్టు నెల చాలా మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక విషయంపై ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి
సమస్యలు పరిష్కారమవడంతోపాటు ప్రేమకు సంబంధించిన జీవితంలో ఉన్నవారు ప్రేమలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు బాగుంటుంది. ఈ నెలలో సంపద పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

వృషభ రాశి
వచ్చే నెల మొత్తం వీరికి బాగా కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలివిగా వ్యవహరించాలి. పనిచేసేచోట తోటి సహోద్యోగులతో కలిసి పనిచేస్తారు. దీనివల్ల పని విషయంలో ఎన్నో మెళకువలను నేర్చుకుంటారు.
గతంకంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. కన్న కలలను ఈ నెలలో నిజం చేసుకుంటారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే విషయంపై ఎక్కువగా దృష్టిసారించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+