2026లో వీరిపైనే లక్ష్మీకటాక్షం..సెలవిచ్చిన బాబా వంగా!
బల్గేరియాకు చెందిన బాబా వంగా మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిష్యశాస్త్ర అంచనాలు దాదాపుగా నిజం అవుతూనే వచ్చాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణి చెప్పిన బాబా వంగ యుద్ధాలను అంచనా వేశారు. ప్రకృతి విపత్తులు వస్తాయని చెప్పారు. ఇక 2026 సంవత్సరంలో కూడా మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఆందోళన కలిగించే విషయాలను తెలిపారు. ఇదే సమయంలో 2026లో అదృష్టవంతులుగా ఉండే కొన్ని రాశులను గురించి బాబా వంగ వెల్లడించారు.
వృషభ రాశి
బాబా వంగ చెప్పిన దాని ప్రకారం 2026 సంవత్సరంలో వృషభ రాశి జాతకులు అనేక రంగాలలో రాణిస్తారు. వీరికి మంచి అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి వృషభ రాశి జాతకులకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి జాతకులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

కన్యారాశి
2026 సంవత్సరంలో కన్యా రాశి వారు విశేష ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వ్యాపారవేత్తలకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. పనిచేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఇది కన్యా రాశి వారికి మంచి సంవత్సరం గా ఉంటుందని బాబా వంగా చెప్పారు.
వృశ్చిక రాశి
2026 సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనేక అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బాగుంటుంది. ఈ సమయంలో పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు.
కుంభరాశి
2026 సంవత్సరం కుంభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. కుంభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. కుంభ రాశి వారి కుటుంబ జీవితం బాగుంటుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications