జూన్ లో భద్ర మహాపురుష రాజయోగం.. ఈ రాశులవారు మట్టి పట్టుకున్నా బంగారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో బుధుడు వృషభరాశి నుంచి మిధున రాశికి రవాణా అవుతాడు. మిధున రాశిలో బుధ సంచారం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారి పైన కచ్చితంగా ఉంటుంది. బుధుడు తన స్వంత రాశిలో, ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న సమయంలో, అది భద్ర మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది.
జూన్ లో భద్ర మహాపురుష రాజయోగం
జూన్ 14వ తేదీ రాత్రి పది గంటల 55 నిమిషాలకు బుధుడు మిధున రాశిలోకి వెళతాడు. ఇక ఈ బుధసంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా, భద్ర మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది.

మిధున రాశి
జూన్ నెలలో మిధున రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం కారణంగా అన్ని విధాలుగా కలిసివస్తుంది. మిథున రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో జీవితంలోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం.
సింహరాశి
జూన్ నెలలో సింహరాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం కారణంగా అన్ని విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసినా విజయవంతమవుతుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ లను పొందుతారు. ఉన్నతాధికారులతో మెప్పు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇక సింహరాశి వారికి విదేశాలలో డబ్బు సంపాదించడానికి ఇది సువర్ణవకాశం. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఉత్సాహంగాను, ఆరోగ్యంగానూ ఉంటారు.
మకర రాశి
జూన్ నెలలో భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి జాతకులను అదృష్టం వరిస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ సమయంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. విదేశాలలో నివసించే వారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో జీతం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications