ఈ రాశులలో పుట్టిన అబ్బాయిలు గ్రేట్ లీడర్స్

భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. అంతేకాదు ప్రతి ఒక్కరిలోనూ తమదైన స్కిల్స్ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో 12రాశి చక్రాలలో పుట్టినవారి ప్రవర్తన, లక్షణాలు ఆయా రాశులపైన ఆధారపడి ఉంటాయి. కొంతమంది అబ్బాయిలు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారి పుట్టిన రాశి ప్రభావం వలన వారికి నాయకత్వ లక్షణాలు వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీ ఉన్న అబ్బాయిలు సహజంగా ఏ రాశులలో పుట్టినవారో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి జాతకులలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మేష రాశి జాతకులు తమ జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. మేష రాశికి కుజుడు అధిపతి కావడం వల్ల కుజుడు ధైర్యాన్ని సూచించే గ్రహం కావడం వల్ల వీరిలోనూ అదే ధైర్యం, అదే నాయకత్వం ఉంటుంది. జీవితంలో సమస్యలను చూసి ఎప్పుడు వీరు వెనుకడుగు వేయరు. నిర్ణయాత్మక సామర్థ్యం వీరికి ఎక్కువ.

Boys born under these zodiac signs are great leaders

మిధున రాశి
మిధున రాశికి బృహస్పతి అధిపతి. తెలివితేటలను, జ్ఞానాన్ని సూచించే గ్రహం బృహస్పతి పాలించే రాశిగా మిధున రాశి జాతకులకు లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి. మల్టీ టాస్కింగ్ చేయడంలో వీరు నిష్ణాతులని చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞాశాలురైన మిధున రాశి వారు గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ప్రశాంతతకు, స్థిరత్వానికి ప్రతీక. కాబట్టి కర్కాటక రాశి జాతకులు చాలా బలమైన, దృఢమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ పని విషయంలోనైనా వీరు చాలా క్లారిటీతో ఉంటారు. వీరిది చాలా బలమైన స్వభావం.

కన్యారాశి
కన్య రాశికి బుధుడు అధిపతి. బుధుడు తెలివితేటలను, కమ్యూనికేషన్ ను సూచించే గ్రహం. కాబట్టి కన్యారాశి జాతకులు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండి లీడర్స్ గా ఎదుగుతారు. తమ జీవితంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి అయినా వెనుకడుగు వేయరు. వీరు గొప్ప విజయాలను సాధిస్తారు.

తులారాశి
తులా రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు విలాసాలను భౌతిక సుఖాలను ఇచ్చే గ్రహం. శుక్రుడి అధిపతి అయిన తులా రాశి జాతకులైన అబ్బాయిలు గొప్ప నాయకత్వంతో ఉంటారు. మీరు తమ జీవితాన్ని రాజులాగా లీడ్ చేస్తారు. బాస్ లాగా ఫీల్ అవుతారు. వీరిలో అంతే స్కిల్స్ కూడా ఉంటాయి. చాలా దృఢమైన సంకల్పశక్తితో వీరు విజయ తీరాలను అందుకుంటారు.

మకర రాశి
మకర రాశికి అధిపతి శని. శని న్యాయాన్ని, క్రమశిక్షణ నేర్పే దేవుడు. అటువంటి శని రాశి అయిన మకర రాశిలో పుట్టిన అబ్బాయిలు చాలా సృజనాత్మకంగా ఉంటారు. జీవితంలో కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కెరీర్లో గొప్ప విజయాలను తమ తెలివితేటలతో సాధిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. మీరు ఎక్కడున్నా లీడర్ లానే జీవిస్తారు.

మీన రాశి
మీన రాశికి అధిపతి బృహస్పతి . బృహస్పతి తెలివితేటలను జ్ఞానాన్ని సూచించే గ్రహం. అటువంటి బృహస్పతికి చెందిన మీనరాశిలో పుట్టిన అబ్బాయిలు ఏ పనినైనా అద్భుతంగా నిర్వహించే నైపుణ్యాలను కలిగి ఉంటారు. మీరు మనసులో ఏది అనుకుంటే ఆ పనిని పూర్తిచేస్తారు. వీరి ప్రవర్తన నమ్మదగినదిగా ఉండటం వల్ల వీరి లీడర్ షిప్ ను ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+