Budh gochar 2024: మిధునరాశిలో బుధాదిత్య రాజయోగం; జూన్ లో వీరికి అఖండ ధనయోగం!!
జూన్ నెలలో ప్రధాన గ్రహాల రాశుల మార్పు కారణంగా ఈ సంవత్సరం జూన్ నెలకి కూడా వేద జ్యోతిషశాస్త్రంలో ప్రాధాన్యత కలిగిన నెలగా గుర్తింపు ఉంది. జూన్ నెలలో సూర్యుడు మరియు బుధుడు రెండూ మిధున రాశిలోకి మార్పు చెందుతారు. ఈ మార్పు మిధున రాశిలో బుధ సూర్య గ్రహాల కలయికకు కారణమవుతుంది. ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.
మిధున రాశిలో సూర్య బుధుల కలయిక.. బుధాదిత్య రాజయోగం
జూన్ 14వ తేదీ ఉదయం 10 :55నిమిషాలకు గ్రహాల యువరాజు బుధుడు మిధున రాశిలో సంచరిస్తాడు. ఆపై జూన్ 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 16 నిముషాలకు సూర్యుడు మిధున రాశిలో సంచరిస్తాడు. మిధున రాశిలో సూర్యుడు బుధుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడి ద్వాదశ రాశుల వారి జీవితాల్లోనూ గణనీయమైన ప్రభావం ఉంటుంది. 6 రాశుల వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఆర్థిక సమృద్ధి కలుగుతుంది.

వృషభ రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా వృషభ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వారు చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభ పడతాయి. ఉద్యోగాల కోసం నిరీక్షించే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
మిధున రాశి
బుధాదిత్య రాజయోగం యోగం కారణంగా మిధున రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబంలో విభేదాలు ఉంటే సమసిపోతాయి. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితి గణనీయంగా పెరుగుతుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సానుకూలంగా పరిష్కరించ బడతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు గురించి ఆలోచించేవారికి ఈ సమయం అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్యారాశి
జూన్ నెలలో వచ్చే బుధాదిత్య రాజయోగం కారణంగా కన్యారాశి వారికి ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేదా విదేశీ వెంచర్ల లో పెట్టుబడి పెట్టే వారికి అనుకూలమైన రాబడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ లోనూ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులందరి కోరికలను తీర్చడానికి కావలసిన ఆర్థిక మద్దతు దొరుకుతుంది.
వృశ్చిక రాశి
జూన్ నెలలో బుధాదిత్య రాజయోగం కారణంగా వ్యాపారాలలో గణనీయమైన లాభాలను ఆశించవచ్చు. ఈ సమయంలో కొనుగోళ్ళు, అమ్మకాలు కలిసి వస్తాయి. నిలిచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. కెరీర్ పరంగా, వృత్తి వ్యాపారాలలోను సంతోషకరమైన పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషదాయకం గాను, రసవంతంగాను ఉంటుంది.
కుంభరాశి
జూన్ నెలలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా కుంభ రాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వాణిజ్యాలలో బాగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్ధికంగా ఇది అనుకూలమైన సమయం. పెట్టిన ప్రతి పెట్టుబడి నుంచి గణనీయమైన రాబడిని ఆశించవచ్చు .ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications