Budh gochar 2024: కర్కాటకరాశిలో బుధగోచారం: ఈ రాశులవారికి ధన నష్టాలు, కష్టాలు.. జాగ్రత్త
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశులవారి పైన ప్రభావం చూపిస్తుంది. జూన్ 29వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశిలోకి బుధ సంచారం కారణంగా అన్ని రాశుల వారి పైన సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. అయితే కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే రాశులు ఏమిటి? ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి
కర్కాటకరాశిలో బుధ సంచారం కారణంగా మేష రాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా మేషరాశి జాతకులు నష్టపోతారు. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. ఏ పని చేసిన సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు. పనితీరు మందగిస్తుంది. ఈ సమయంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు. వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు. వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధ సంచారం కారణంగా ఉద్యోగాలను ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందలేరు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు కొద్దిపాటి లాభాలను పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడవలసి వస్తుంది. తీవ్రమైన పోటీని ఈ సమయంలో ఎదుర్కొంటారు.
మిధున రాశి
బుధ సంచారం కారణంగా మిధునరాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు చోటుచేసుకుంటాయి. కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. పనిచేసే చోట మెరుగైన ప్రదర్శన చూపించలేక పోతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఎక్కువ లాభాలను పొందాలంటే విపరీతమైన కష్టపడవలసి వస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అసలు బాగోదు. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహరాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అవాంతరాలు ఎదురవుతాయి. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరుగుతుంది. కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ఈ సమయంలో కెరీర్ అంతగా బాగోదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిరాశ జనకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ధనస్సు రాశి
బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితోను వ్యాపార భాగస్వాములతోనూ వివాదాలు చోటుచేసుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగాలు చేసే వారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications