Budh gochar 2024: సౌమ్య రాజయోగం.. ఈ రాశులవారు నక్క తోక తొక్కినట్టే
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. దీని ప్రభావం ద్వాదశ రాశుల వారి పైన కచ్చితంగా పడుతుంది. గ్రహాలు రాశుల మార్పు కొన్ని శుభయోగాలను కొన్ని అశుభయోగాలను ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలో బుధుడు జూన్ 14వ తేదీ అంటే నేటి రాత్రి 11: 55 నిమిషాలకు మిధున రాశిలో ప్రవేశిస్తాడు.
మిధునరాశిలో బుధుడు.. సౌమ్య రాజయోగం, భద్ర రాజయోగం
మిధున రాశిలో బుధుడు జూన్ 29వ తేదీ వరకు ఉంటాడు. అయితే బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించడంతో సౌమ్య రాజయోగం, భద్ర రాజయోగం ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశిలో బుధుడు మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకులకు ఈ సమయంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది. విదేశాలలో పనిచేసే వారికి విజయం వరిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో బుధుడు రెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అద్భుతమైన లాభాలు పొందుతారు.
మిధున రాశి
మిధున రాశి వారికి బుధ సంచారం ప్రయోజనంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసే వారికి ఫలితాలు మంచిగా వస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పొందుతారు.
సింహరాశి
సింహరాశిలో బుధుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న, ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాలన్న ఇదే మంచి సమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
కన్య రాశి
కన్యా రాశి జాతకులకు బుధుడు పదవ స్థానంలో రవాణా చేయడం వల్ల వ్యాపారంలో అనేక రంగాలలో లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తులకు కొనుగోలుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి పేరును సంపాదించి పెడతాయి.
తులారాశి
తులా రాశిలో బుధుడు 9వ స్థానంలో రవాణా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతు లభిస్తుంది. విదేశీ కంపెనీల నుంచి అవకాశాలు లాభాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఇప్పుడు మీరు చాలా బలోపేతం అవుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో బుధుడు ఏడో స్థానం నుండి రవాణా చేయడం వల్ల మీకు వ్యాపారంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏవైనా కొత్త వెంచర్లు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. విద్యార్థులకు అనుకూలమైన సమయం ప్రభుత్వ శాఖల్లో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కుంభరాశి
కుంభ రాశిలో బుధుడు ఐదవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. సంతానం గురించి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి.
మీన రాశి
మీనరాశిలో బుధుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వాహనాల కొనుగోలుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications