వీరికి త్వరలో ధనలక్ష్మీ యోగాన్ని, రాజభోగాన్ని ఇస్తున్న బుధ సూర్యుల ద్వయం!
సెప్టెంబర్ నెలలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశం తర్వాత కన్యరాశిలోకి వచ్చే బుధుడితో సంయోగం జరిపి సూర్య, బుధ గ్రహాలు కలిసి అద్భుతమైన బుధాదిత్య రాజయోగాన్ని సృష్టించబోతున్నాయి. సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు రాత్రి 7 గంటల 29 నిమిషాలకు కన్యారాశిలో ప్రవేశిస్తాడు.
బుధాదిత్య రాజయోగం .. అదృష్ట రాశులు
ఇక సెప్టెంబర్ 23వ తేదీన బుధుడు ఉదయం 9.59 నిమిషాలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 23వ తేదీన సూర్యుడు బుధుడి కలయిక బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి యొక్క సంపద మరియు ప్రసంగ గృహంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో సింహరాశి జాతకుల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఎప్పటినుండో వసూలు కానీ మొండి బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. సింహరాశి వారి వర్తక వ్యాపారాలు ఆర్థిక లాభాలను తెస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇది సింహ రాశి వారికి మెరుగైన సమయం.
వృశ్చిక రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా వృశ్చికరాశి వారికి లబ్ధి జరుగుతుంది. వృశ్చికరాశి యొక్క ఆదాయ మరియు లాభగృహంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగంతో వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికపరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఏదైనా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ప్రయోజనాలను ఇస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
మకర రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మకర రాశి వారి అదృష్టం ఈ సమయంలో బాగుంటుంది. వీరి ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. మకర రాశి వారి ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సమయంలో వీరికి డబ్బు బాగా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications