జనవరిలో అద్భుత రాజయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం!

2025 జనవరి మాసంలో సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఒకే రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య రాజ యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై మకర రాశిలోకి జనవరి 24వ తేదీన బుధుడు ప్రవేశిస్తాడు.

బుధాదిత్య రాజయోగం
దీంతో బుధ, సూర్యుల సంయోగం జరిగి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఫిబ్రవరి 11వ తేదీ వరకు మకర రాశిలో కొనసాగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా నాలుగు రాశుల వారు సంపదలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Budhaditya Rajyoga in january these zodiac signs will become millionaires in 2025

ధనుస్సు రాశి
జనవరి మాసంలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి . ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాలుగా ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. పనిలో విజయాలు చేకూరుతాయి. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

మకర రాశి
జనవరిలో మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకరరాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి .జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో బాగా లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.

తులారాశి
తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా నూతన సంవత్సరంలో మంచి సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడికి మంచి రాబడికి ఇది మంచి సమయం. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇది తులారాశి వారికి మంచి కాలం.

కుంభరాశి
కుంభరాశి వారికి మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఆర్థిక విషయాలలోనూ, వృత్తి అవకాశాలలోనూ వృద్ధిని అనుభవిస్తారు. ఈ సమయంలో వీరు వీరిలో ఉన్న కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి బాగుంటుంది. ఇది వీరికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య రాజయోగం కుంభరాశి జాతకులకు మంచి అవకాశాలను ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+