2025లో వీరిని కోటీశ్వరులను చెయ్యకుండా వదిలిపెట్టనన్న బుధాదిత్య రాజయోగం!
జనవరి 2025 లో సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఒకే రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై జనవరి 24వ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
బుధాదిత్య రాజయోగం
అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడుతో, బుధుడు సంయోగం చెందుతాడు. దీంతో జనవరి 24వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఫిబ్రవరి 11వ తేదీ వరకు మకర రాశిలో కొనసాగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ఆ రాశులవారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాలుగా ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. పనిలో విజయాలు చేకూరుతాయి. వ్యక్తిగత జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశిలో బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు వ్యాపారులకు లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో బాగా లభిస్తుంది.
తులారాశి
తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. పెట్టుబడికి మంచి రాబడికి ఇది మంచి సమయం. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి.
కుంభరాశి
కుంభరాశి వారికి ఆర్థిక విషయాలలోనూ, వృత్తి అవకాశాలలోనూ వృద్ధిని అనుభవిస్తారు. బుధాదిత్య రాజయోగం కుంభరాశి జాతకులకు మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వీరిలో ఉన్న కొత్త ఆలోచనలు ప్రదర్శించడానికి బాగుంటుంది. ఇది వీరికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications