కోపం, ద్వేషంతో రగిలిపోతున్నారా? అయితే అంగారక యోగం ప్రభావం కావచ్చు.. ఏం చెయ్యాలో తెలుసుకోండి

వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలతో పాటు అశుభయోగాలు కూడా ఉంటాయి. అటువంటి అశుభయోగాలలో అంగారక యోగం ఒకటి. అసలు అంగారక యోగం ఏ విధంగా ఏర్పడుతుంది? అంగారక యోగం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? అంగారక యోగం ఏర్పడితే తెలుసుకోవడం ఎలా? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? అంగారక యోగం యొక్క ప్రభావాలను ఏ విధంగా తగ్గించాలి వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం ఇక్కడ తెలుసుకుందాం.

అంగారక యోగంతో అన్ని రాశులవారిపై ప్రభావం
అంగారక యోగం ఒక ఆశుభమైన యోగం. ఇది కోపం, అసూయ, ద్వేషాలు, వివాదాలు, నిరాశ, మానసిక, శారీరక అనారోగ్యాలు మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది. అంగారక యోగం కుజుడు మరియు రాహువు కారణంగా ఏర్పడుతుంది. ఏదైనా రాశిలో కుజుడు మరియు రాహువు కలయిక జరిగినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. రాహువు మరియు కుజుడు కలయిక అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Burning with anger and hatred But may be the effect of Angarak Yoga Know what to do

ప్రతీ 18 నెలలకూ అంగారక యోగం
రాహువు కుజుడు ఉన్న స్థానాలను బట్టి కొన్నిసార్లు మంచి కూడా జరుగుతుంది. రాహువు మరియు కుజుడు సంయోగంతో ఏర్పడే అంగారక యోగం ప్రతి 18 నెలలకు ఒకసారి సంభవిస్తుంది. ఇది అందరి జీవితాలలో అనేక ముఖ్యమైన మార్పులకు కారణమవుతుంది. అంగారక యోగం వల్ల కలిగే ఇబ్బందులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే అంగారక యోగం వల్ల ప్రభావితమైన వ్యక్తుల ప్రవర్తనను బట్టి గుర్తించవచ్చు.

జాతకులలో అంగారక యోగం ప్రభావం గుర్తించటం ఇలా
ఈ యోగం ప్రభావం వల్ల ఆయా జాతకులు విపరీతమైన కోపంతో ఉంటారు. వారు సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అయినప్పటికీ వారు ఇతరులకు సహాయపడే స్థితిలోనే ఉంటారు. జాతకంలో రాహువు మరియు కుజుడు ఒకే చోట కలిసి ఉంటే అంగారక యోగం ఏర్పడుతుంది. అంగారక యోగం యొక్క మొదటి సంకేతాలుగా కోపం ,అసూయ, ద్వేషం, ఉత్సాహం, అధికమైన శక్తి వారిలో కనిపిస్తుంది.

అంగారక యోగం వలన ప్రభావాలు తగ్గటానికి చెయ్యాల్సింది
అంగారక యోగం వల్ల మంచి కానీ చెడు కానీ జరగవచ్చు. అంగారక యోగం యొక్క ప్రతికూలమైన ప్రభావాలను తగ్గించడానికి మతపరమైన ఆచారాలను చేయడం, గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి రత్నాలను ధరించడం మంచిది. అంతే కాదు అంగారక యోగం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడానికి యోగా, ధ్యానం మొదలైనవి చేయాలని చెబుతారు.

అంగారక యోగం మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది
ఎందుకంటే అంగారక యోగం ముఖ్యంగా మనిషి యొక్క మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనసుపై కలిగే ఒత్తిడిని తగ్గించడానికి ఈ విధంగా చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు అంగారక దోషం యొక్క ప్రభావం తగ్గించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిదని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+