అక్షయ తృతీయకు బంగారానికి బదులుగా ఇవి తెచ్చుకున్నా కనకవర్షమే!

హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే అక్షయ తృతీయకు సమయం దగ్గర పడుతుంది. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోవడానికి అందరూ సిద్ధమవుతున్నారు. హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటిగా చెప్పబడే అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథినాడు జరుపుకుంటాం .ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

అక్షయ తృతీయ పండుగకు బంగారం కొనలేకపోతున్నారా?
అయితే ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో అక్షయ తృతీయ పండుగకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సాహసం చేసే పరిస్థితి లేదు. ఇక అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేక బాధపడి మధ్యతరగతి, సామాన్య ప్రజలకు బంగారానికి బదులుగా, బంగారం లాంటి తరుణోపాయాన్ని చెప్పారు పండితులు.

Buy these items instead of gold for Akshaya Tritiya gives wealth

బంగారం బదులు వీటిని కొనుగోలు చెయ్యండి
బంగారం కొనుగోలు చేసే శక్తిలేని వారు బాధపడాల్సిన అవసరం లేదని సూచించారు. బంగారానికి బదులుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది.

వీటిని అక్షయ తృతీయకు తెచ్చుకుంటే శుభం
ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని నియమనిష్టలతో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చి ఊహించని ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజిస్తే కూడా శుభం జరుగుతుంది.

ఇవి కొన్నా కనక వర్షమే
అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటే కూడా శుభం జరుగుతుంది. ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజలు నిర్వహించటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇక అక్షయ తృతీయనాడు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారో వారి పైన పేర్కొన్న వాటిలో వేటినైనా ఒకదానిని కొనుగోలు చేసి తెచ్చుకుంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+