మీ చేతిని బట్టి మీ జాతకం ఏమిటో తెలుసుకోండి

జాతకం చెప్పడానికి సాధారణంగా జ్యోతిష్యులు అరచేతులు చూస్తుంటారు. అరచేతిలోని రేఖలు ఓ వ్యక్తి భవిష్యత్తును తెలియజేస్తాయని అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది.

జ్యోతిష్యాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేసినవారు చాలా నిర్దిష్టంగా భవిష్యత్తును చెబుతారని అంటారు. అరచేతులు చూసి హస్తసాముద్రికం ప్రకారంం జాతకం చెప్పవచ్చు.

 చేతి పొడవును బట్టి విషయాలు...

చేతి పొడవును బట్టి విషయాలు...

కొందరి చేతులు పొడవు, వెడల్పు సమానంగా ఉంటాయి.. వారి చేతి గోళ్లు కూడా చతురస్రాకారంలో ఉంటాయియ. ఇలాంటి చేతులు ఉన్నవారి ఆలోచనలు, నీతినియమాలు సక్రమంగా ఉంటాయి. ఉత్తమ మార్గంలో ప్రయాణిస్తారు. మంచి పనులు చేస్తారు, సంపాదన కూడా అలాగే చేస్తారు. వారికి జాలి, దయాగుణాలు కూడా ఎక్కువే. అందరి చేత మంచి అనిపించుకుంటారు. సమాజంలో గౌరవం, పేరుప్రతిష్టలు ఉంటాయి.

 చేతి వెడల్పును బట్టి ఇలా...

చేతి వెడల్పును బట్టి ఇలా...

అరచేయి కింది భాగం వెడల్పుగా ఉంటాయి. వేళ్లు దూరందూరంగా ఉంటాయి. ఇలాంటి వాళ్లకు ధైర్యసాహసాలు ఎక్కువ. ఉత్సాహం కూడా అధికమే. వీళ్లు ఎల్లవేళలా మార్పును కోరుకుంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. పేరు, గౌరవం పొందుతారు. వీరికి ప్రయాణాలు చేయడమంటే ఇష్టం.

వేళ్లు వంగి ఉంటే....

వేళ్లు వంగి ఉంటే....

కొందరి చేతులు వంగి వంకరగా ఉంటాయి. వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువట. భగవంతుడిపై విశ్వాసం ఉంటుంది. దైవకార్యక్రమాలు, ధార్మిక సేవలు చేస్తుంటారు. సంసార జీవితం అంత ఆనందదాయకంగా ఉండదట. ఏకాకి జీవితమే ఉంటుందట.

 వేళ్ల చివరలు మొనదేలి ....

వేళ్ల చివరలు మొనదేలి ....

వేళ్ల చివరలు మొనదేలి ఉండేవారి హస్తాన్ని కళాహస్తం అంటారు. చివరికి వెళ్తున్న కొద్దీ వేళ్లు నున్నగా, మొనదేలి ఉంటాయి. వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువట. కళల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. నటులు, కవులు, గాయకుల హస్తాలు ఇలా ఉంటాయి. ఇతరులను ఆకట్టుకునే గుణం కూడా ఎక్కువేనట.

 మొనదేరిన హస్తం....

మొనదేరిన హస్తం....

వీరి వేళ్లు సన్నగా, పొడవుగా మొనదేలి ఉంటాయి. సున్నితంగా, చూడ ఇంపుగా కూడా ఉంటాయి. వీరిది సున్నితమైన మనస్సు. దైవభక్తి ఎక్కువే. శాంతినే కోరుకుంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడుతారు. వీరు కలల ప్రపంచంలో తేలుతుంటారు. సంసార సుఖంపై దృష్టి ఎక్కువ. సుఖజీవులు కూడా.

 మొరటు హస్తం...

మొరటు హస్తం...

చిన్న చేతులు, చిన్న వేళ్లు, మొరటుగా చూడడానికి కాస్తా వెగటుగా ఉంటాయి. వీరి ఆలోచనలు చక్కగా ఉండవు. తెలివితేటలు, లోకజ్ఞానం కూడా ఉండదట. నిలకడ ఉండదు. ఆదాయం లేక బాధపడుతుంటారట. వీరికి వివాహం జీవితం కూడా బాగుండదట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+