Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2026లో వీరికి లాటరీ కన్ఫర్మ్ చేసిన శని, రాహువులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహాలలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 2026 సంవత్సరంలో శని దేవుడు మార్చి ఏప్రిల్ నెలలో అస్తమించి మళ్లీ ఉదయిస్తాడు. ఈలోగా రాహువు కుంభరాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

2026లో శని, రాహు గ్రహాల సంచారంలో మార్పులు
ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని, రాహు గ్రహాల కారణంగా ఆర్థిక లాభాలతో పాటు పురోగతిని వారు అనుభవిస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Changes in the transit of Saturn and Rahu in 2026 These zodiac signs will be lucky

మకర రాశి
మకర రాశి జాతకులకు శని, రాహువు కదలికలలో మార్పులు ప్రయోజనకరంగా ఉంటుంది. శని మకర రాశి నుండి మూడవ ఇంట్లో ఉదయిస్తాడు. రాహువు లగ్న గృహంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల 2026 సంవత్సరంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారు ఆర్థిక విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.

తులారాశి
తులా రాశి జాతకులకు శని రాహువు కదలికల కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. శని తులారాశిలో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాహువు నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అందువల్ల కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. శత్రువుల పైన కూడా విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి.

మిధున రాశి
శని, రాహువు సంచారం 2026 లో మిధున రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శని మీ రాశిలో కర్మ గృహంలో, రాహువు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తారు. దీని ఫలితంగా మిధున రాశి వారు వ్యాపారాలలో పురోగతిని చూస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. తండ్రితో అనుబంధం మెరుగుపడుతుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+