త్వరలో ఈ రాశులవారికి ఆర్ధిక నష్టాలు, కష్టాలు ప్రకటించిన చతుర్గ్రాహి యోగం.. జాగ్రత్త!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావం పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెల అక్టోబర్ మాసంలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభాలను, మరికొన్ని రాశుల వారికి అశుభాలను కలిగిస్తుంది.

చతుర్గ్రాహి యోగం
సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు వంటి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ రెండవ తేదీ సూర్యగ్రహణం రోజున ఏర్పడుతున్న ఈ చతుర్గ్రాహి యోగం కారణంగా తీవ్ర ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొనే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Chaturgrahi yoga announces financial losses and difficulties for these zodiac signs soon beware

తులారాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా తులారాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులకు ఊహించని ఇబ్బందికర పరిణామాలు కలుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అంతగా కలిసిరాదు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

కుంభరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా కుంభరాశి జాతకులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి జాతకులు అనుకున్న ఫలితాలను పొందలేరు. ఈ సమయంలో కుంభ రాశి వారి సృజనాత్మకత పెరిగినప్పటికీ కొన్ని చిరాకులను మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా అనారోగ్య సమస్యలతో ఈ సమయంలో సతమతమవుతారు. కుంభరాశి జాతకులు ఉద్యోగంలోనూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

మీనరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మీన రాశి జాతకులకు నష్టాలు, కష్టాలు సంభవిస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారికి అధిక భావోద్వేగాలు కలుగుతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అయితే ఈ సమయంలో ఎవరిని పడితే వారిని నమ్మడం మాత్రం నష్టాలకు కారణమవుతుంది. ఈ సమయంలో విద్యార్థులు తీవ్రంగా కష్టపడవలసి ఉంటుంది. ఉద్యోగాలలో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ ఈ సమయంలో అనుకోని చిరాకులను మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+