Today Rasi Phalalu: కర్కాటక రాశిలో బృహస్పతి గోచారం..ఈ రాశుల వారి జాతకాలు మారిపోతాయ్

12-08-2025 నాటి రాశి ఫలాల గురించి ఇక్కడ ఇవ్వబడింది. ప్రతి రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు, సానుకూల అంశాలు, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలను ఇక్కడ వివరించబడ్డాయి.

మేష రాశి: ఈ రోజు మీరు పనులను సమర్ధవంతంగా నిర్వహించి విజయం సాధిస్తారు. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మీ వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభ రాశి: మీరు చేపట్టే వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. మీ అంచనాలు నిజం కాగలవు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

daily horoscope for august 12 2025

మిథున రాశి: సోదరులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు ఉంటాయి.

కర్కాటక రాశి: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒప్పందాలలో జాప్యం జరుగుతుంది. పనులు మధ్యలో ఆగిపోతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురవుతుంది.

సింహ రాశి: సన్నిహితులతో ఉన్న వివాదాలు తీరిపోతాయి. మీకు ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కన్యా రాశి: ఈ రోజు మీరు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి.

తులా రాశి: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. స్నేహితులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చిక రాశి: మీరు చేపట్టిన పనులు ముందుకు సాగవు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు రాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకర రాశి: మీరు చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో తగాదాలు రావచ్చు. ప్రయాణాలలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి.

కుంభ రాశి: బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడులు తొలగిపోతాయి.

మీన రాశి: ఇంటాబయటా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+