దేవశయని ఏకాదశి: విష్ణువు దయతో జులై 17నుండి ఈ రాశులవారికి లక్ష్మీకటాక్షం!!

హిందూమతంలో దేవశయని ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆషాడ మాసంలో వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడని నాలుగు నెలల పాటు ఆయన నిద్రలోనే ఉంటాడని చెబుతారు. అయితే ఈ సంవత్సరం దేవశయని ఏకాదశి జూలై 17వ తేదీన వస్తుంది. దేవశయని ఏకాదశి ఈసారి అద్భుత గ్రహాల కలయిక వల్ల చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

దేవశయని ఏకాదశి .. అదృష్ట రాశులు
దేవశయని ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. వారికి సంపద వర్షం కురుస్తుంది. వారు అన్ని విషయాల్లో అపార విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Devashayani Ekadashi Lakshmi blessings for these zodiac signs with the grace of Lord Vishnu

మేషరాశి
దేవశయని ఏకాదశి రోజు కీలక గ్రహాల కలయిక కారణంగా మేష రాశి వారి జీవితంలో కీలక మార్పులు వస్తాయి. మేష రాశి వారు వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్ధక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఈ సమయంలో సంపద బాగా పెరుగుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ డబ్బు వసూలు అవుతుంది. జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు.

వృషభ రాశి
దేవశయని ఏకాదశి వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. దేవశయని ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. జీవితంలో అన్ని సమస్యల నుంచి వృషభ రాశి వారు బయటపడతారు. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికంగా ధనవంతులవుతారు. చేసే పనిలో ఆశించిన లాభాలను పొందుతారు.

సింహరాశి
దేవశయని ఏకాదశి నుండి సింహ రాశి వారికి కలిసొస్తుంది. విష్ణు అనుగ్రహంతో వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లగ్జరీగా సింహ రాశి వారు ఈ సమయంలో జీవించటానికి అన్ని వనరులు సమకూరుతాయి.

కన్యారాశి
దేవశయని ఏకాదశి నాడు అద్భుత గ్రహాలు కలయిక కారణంగా కన్యా రాశి వారి జీవితంలో శుభ సమయం వస్తోంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్నీ శుభవార్తలే అందుతాయి. ఆర్థిక విషయాలలో లబ్ధి జరుగుతుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్ లో అపారమైన విజయాలను పొందుతారు. ఆర్థిక విషయాలలో ఈ సమయం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే శుభసమయం ఇది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+