జులై 5న విశేష శుభయోగాలతో ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య తిథికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈసారి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రత్యేకపూజలు చేసి దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు. అయితే ఈసారి జ్యేష్ఠ అమావాస్య రోజు రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు, మరికొన్ని అరుదైన శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.
జ్యేష్ఠ అమావాస్య శుభ యోగాలు
2024 జ్యేష్ఠ అమావాస్య రోజున సర్వార్ధ సిద్ధియోగంతో, పాటు ధృవయోగం, శివ వాస్ యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాల కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. వారికి ధనలక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాల కారణంగా మేష రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య నుంచి మేషరాశి జాతకులకు ఉద్యోగ పరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
వృషభ రాశి
జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాల కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వ్యాపారులకు ఈ కాలంలో లాభాలు వస్తాయి. ఇప్పటినుంచి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. వృషభ రాశి జాతకులు చేసే ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
కర్కాటక రాశి
జ్యేష్ఠ అమావాస్య వేళ ఏర్పడే శుభయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయపరంగా లబ్ధి జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. నూతన ఉద్యోగాలను చేయడానికి ఇది సరైన సమయం.
సింహరాశి
జ్యేష్ఠ అమావాస్య వేళ ఏర్పడే శుభయోగాల కారణంగా సింహ రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కన్యారాశి
జ్యేష్ఠ అమావాస్య నాడు ఏర్పడే శుభయోగాల ఫలితంగా కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభరాశి
జ్యేష్ట అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాలు కుంభరాశి జాతకులకు శుభాలను అందిస్తాయి. కుంభరాశి జాతకులకు డబ్బు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. పిల్లలు ప్రయోజకులవుతారు.
మకర రాశి
జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభ యోగాల కారణంగా మకర రాశి జాతకులకు మంచి రోజులు వస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అన్ని రంగాలలోనూ పనిచేసే వారికి పురోగతి కలుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
తులారాశి
జ్యేష్ఠ అమావాస్య రోజు ఏర్పడే శుభయోగాల ఫలితంగా తులా రాశి వారికి మంచి జరుగుతుంది. తులారాశి వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగాను మీకు కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications