Diwali 2023: దీపావళి పండుగనాడు ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!

దీపావళి పండుగ.. హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఈ సంవత్సరం దీపావళి పండుగ నవంబర్ 12వ తేదీన వస్తుంది. దీపావళి పండుగనాడు ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించి, బంధుమిత్రులతో మిఠాయిలు పంచుకుంటూ, ఇల్లంతా దీప కాంతులను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు. దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవిని, వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

అయితే దీపావళి పండుగ సందర్భంగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటే, చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. దీపావళి పండుగ నాడు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు. ఇక అవి ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లోని బ్రహ్మ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి.

Diwali 2023: Dont do these things on Diwali!!

దీపావళి పండుగ రోజు ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండదు. ఇంట్లో బూజు లేకుండా శుభ్రం చేసుకునే లక్ష్మీ దేవిని పూజించాలి. లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది. అదే జరిగితే మనం ఆర్థిక ఇబ్బందులతో వలసిన పరిస్థితి వస్తుంది. దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరు కొత్త బట్టలను ధరిస్తారు. అయితే బట్టల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

దీపావళి పండుగ నాడు ధరించే బట్టలలో నలుపు రంగు దుస్తులు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. నలుపు రంగు బట్టలు అశాంతిని, నిరాశను, అశుభాన్ని సూచిస్తాయి కాబట్టి, పొరపాటున కూడా పండుగ రోజు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. దీపావళి పండుగ నాడు ఇతరులను తిట్టడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ చెయ్యకూడదు.

మనసంతా లక్ష్మీదేవి పైన లగ్నం చేసి లక్ష్మీ పూజ చేసుకోవాలి కానీ తిట్టడం, గొడవ పెట్టుకోవడం, ఏడవడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసించకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి దీపావళి పండుగ నాడు పొరపాటున కూడా పైన చెప్పినవి చేయకూడదని పండితులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+