Diwali 2023: దీపావళికి వాస్తు ప్రకారం ఈ పనులు చేస్తే ధనలక్ష్మీ కటాక్షం!!
దీపావళి హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగ. దీపావళి పండుగను భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా బంధు మిత్రులతో వేడుక చేసుకుంటారు. తియ్యని మిఠాయిల రుచులను ఆస్వాదిస్తూ ఇంటిని దీప కాంతులతో నింపి, కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడుపుతారు.
చాలామంది దీపావళి పండుగ వస్తుందంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇంటిని కొత్తగా డెకరేట్ చేయడం ప్రారంభిస్తారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో, డెకరేట్ చేసుకునే విషయంలోకొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిదని, ఫలితంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ చేసుకోవటం కోసం మొదటి నియమం ఇంటి శుభ్రత. దీపావళికి ముందు ప్రతికూల శక్తులను ఇంటి నుంచి ప్రతి ఒక్కరు పారద్రోలాలి .ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించడానికి ఇంట్లోని ప్రతి చిన్న మూలను శుభ్రపరచడం చాలా అవసరం. దీపావళికి సంబంధించి అత్యంత ప్రాథమిక వాస్తు చిట్కాలలో ఇది ఒకటని పండితులు చెబుతున్నారు. దీపావళి పండగ ముందు ఇంట్లో ఎక్కడ బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
ఇక ఇంటిని శుభ్రం చేసే సమయంలో వంట గది పైన, స్టోర్ రూమ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టిని పెట్టి శుభ్రం చేయాలి. ఇంటి నిండా వస్తువులు పెట్టి, అవి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది మంచిది కాదని చెబుతున్నారు. వీటి వల్ల వాస్తు దోషాలు వస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఉపయోగించని వస్తువులు, ఎలక్ట్రానిక్స్, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.
పగిలిపోయిన అద్దాలను కూడా ఇంటి నుండి బయటపడవెయ్యాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఎప్పుడు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలని చెబుతున్నారు. ఇక ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈశాన్య మరియు ఉత్తరం దిశలు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఉత్తర, ఈశాన్య దిశలు సంపదను శ్రేయస్సును నిర్ధారిస్తాయి కాబట్టి ఈ రెండు దిశలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications