Diwali 2024: దీపావళికి రాశులవారీగా ఈ దానాలతో మీ ఇంట సంపదల వర్షం!

హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలను నింపాలని కోరుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస. ప్రతి ఇంట్లోనూ దీపాలను వెలిగించి జీవితమంతా వెలుగులతో నిండి పోవాలని కోరుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు హిందూ శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

దీపావళి నాడు దానాలు చేస్తే మంచిది
ఇక దీపావళి పండుగ నాడు చేయకూడ,ని చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకున్నాం. ఇక దీపావళి పండుగ రోజు కొన్ని రకాల దానాలు చేస్తే మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. సంపదల వర్షం కురుస్తుంది. దీపావళి పండుగ రోజు కొన్ని రకాల దానాలను చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

Diwali 2024 Shower wealth in your home with these zodiac wise donations for Diwali

అన్న దానం, వస్త్ర దానం దీపావళి నాడు చెయ్యొచ్చా
దానాలు అన్నింటిలోకి అన్నదానం గొప్పదని చెబుతారు. అటువంటి అన్నదానాన్ని చేస్తే మంచిది దీపావళి పండుగ నాడు పేదలకు ఆహారంతో పాటు, స్వీట్లు దానం చేసిన మంచిది. దీపావళి పండుగ నాడు నిరుపేదలకు బట్టలు దానం చేస్తే మంచి జరుగుతుంది. చిన్న పిల్లలకు కొత్త బట్టలు దానం చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది.

రాశుల వారీగా ఇవి దానం చెయ్యాలి
ఇక దీపావళి పండుగ నాడు గో సేవ చేయడం కూడా మంచిది. గోశాలలకు దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రాశుల వారిగా దీపావళి పండుగ నాడు చేయవలసిన దానాలను చూస్తే మేషరాశి వారు దీపావళి పండుగ నాడు స్వెటర్లు, దుప్పట్లు దానం చేయాలి. వృషభ రాశి వారు స్వీట్లు, మిఠాయిలు దానం చేయాలి.

ఈ దానాలతో దీపావళి పండుగ మెండుగా
మిధున రాశి వారు పక్షులకు ఆహారం, నీరు పెట్టాలి. కర్కాటక రాశి వారు మినప్పప్పును దానం చేయాలి. సింహ రాశి వారు దీపావళి పండుగ నాడు నవధాన్యాలను పేదలకు దానం చేయాలి. దీపావళి పండుగ నాడు కన్యా రాశి వారు ఆవనూనెను దానం చేయాలి. తులా రాశి వారు పేదలకు ఆహారాన్ని దానం చేయాలి లేదా డబ్బులు కూడా దానం చేయొచ్చు.

దానాలతో ఈ రాశులకు అంతా శుభమే
వృశ్చిక రాశి వారు దుప్పట్లు దానం చేయాలి . ధనుస్సు రాశి వారు ఆవులకు ఆహారాన్ని పెట్టాలి. మకర రాశి వారు దీపావళి నాడు నాడు పప్పులను దానం చేయాలి. కుంభ రాశి వారు అన్నదానం చేయాలి. మీన రాశి వారు దీపావళి పండుగ నాడు ఎవరైనా పేద విద్యార్థికి విద్యాదానం చేయాలి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+