దీపావళి నాడు వీటిని చూస్తే మీకు కుబేరుడి కటాక్షం!

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు దీపావళి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటాం. నరకాసురుని సత్యభామ సంహరించిన శుభ దినానికి ప్రతీకగా, నరకాసురుడిని సంహరించిన తర్వాత రోజు దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి అంటే దీపముల వరుస. దీపావళి పండుగ నాడు దీపాలను వెలిగించి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

దీపావళికి వీటిని చూస్తే అదృష్టం
దీపావళి పండుగ రోజు మనం కొన్నింటిని చూడడం వల్ల శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. మరి దీపావళి పండుగ రోజు చూస్తే అదృష్టం కలిసి వచ్చేవి ఏమిటి అనేది తెలుసుకుందాం. దీపావళి పండుగ నాడు గుడ్లగూబని చూస్తే చాలా మంచిది. ఎవరైతే దీపావళి పండుగనాడు గుడ్లగూబని చూస్తారో వారికి తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు.

Diwali 2025 Lucky Signs See for Wealth Prosperity amp amp Blessings from Lord Kubera

ఇవి కనిపిస్తే దీపావళి నాడు సానుకూల మార్పులు
దీపావళి నాడు ఏనుగును చూస్తే కూడా శుభం కలుగుతుందని చెబుతారు. ఏనుగును శ్రేయస్సుకు చిహ్నంగా చెబుతారు. దీపావళి పండుగ రోజున ఎవరైతే ఏనుగులు చూస్తారో వారి జీవితంలో మంచి మార్పులు వస్తాయని, సానుకూల ఫలితాలను చూస్తారని చెబుతారు. ఇక దీపావళి పండుగనాడు గోమాత ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే అని చెబుతారు.

దీపావళికి వీటితో సంపద వృద్ధి
దీపావళి రోజున అత్యంత పవిత్రంగా భావించే గోమాతను పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతారు. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి కొలువై ఉండే తామర పువ్వును చూసిన మంచి జరుగుతుందని, సంపద పెరుగుతుందని, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుందని చెబుతారు. దీపావళి పండుగ నాడు కాకి కనిపిస్తే అది పూర్వీకుల నుండి ఆశీస్సులను తీసుకువస్తుందని, ఇది కూడా మీకు మంచే చేస్తుందని చెబుతారు.

దీపావళి నాడు ఇవి కనిపిస్తే ధన లాభ సూచన
దీపావళి పండుగ నాడు పిల్లి కనిపించినా సరే శుభం జరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. ఇక దీపావళి పండుగనాడు చిట్టెలుక కనిపిస్తే అది ధన లాభానికి సూచన అని చెబుతారు. కనుక దీపావళి పండుగ నాడు పైన పేర్కొన్నవి ఏవి చూసినా సరే మీకు సంపదలు వర్షం కురుస్తుంది. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది.

Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+