vastu tips: కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచకండి.. ఆరోగ్యంతో పాటు ఆర్ధికనష్టం!!
ఇల్లు నిర్మించుకుంటే వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అప్పుడే ఆరోగ్యం, శ్రేయస్సు రెండూ కలుగుతాయి. ఇంట్లో ఉన్న గదులను మాత్రమే కాకుండా కిటికీలు, తలుపులు పెట్టే విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. చాలామంది కిటికీల విషయంలో వాస్తు పాటించరు.
కిటికీల విషయంలో వాస్తు పాటించడం అవసరమని, కిటికీల విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఆ ఇంట్లో ఆర్థికనష్టాలు జరుగుతాయని, కొత్త కష్టాలు వస్తాయని, ఆరోగ్యభంగం కలుగుతుందని చెబుతున్నారు. మరి కిటికీల విషయంలో పాటించవలసిన వాస్తు నియమాలు విషయానికి వస్తే.. ఇంటి కిటికీలు ఎప్పుడూ బయట కాకుండా ఇంటి లోపల తెరుచుకునే విధంగా ఉండాలి. కిటికీలు తెరిచినప్పుడు ఎప్పుడైనా కిర్రుమనే శబ్దం రాకుండా ఉండాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీలు ఉత్తరంవైపున నిర్మించుకుంటే మంచిది. ఉత్తర దిక్కు సంపదలకు దేవుడైన కుబేరుని దిక్కుగా చెబుతారు. కాబట్టి ఇంట్లో కిటికీలు ఉత్తర దిశలో ఉంటే కుబేరుడి ఆశీర్వాదం ఉంటుంది. చాలా మంది కిటికీలు తెరవకుండా ఎప్పుడూ మూసే ఉంచుతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కిటికీలు తెరవడం వల్ల గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తుంది. దీని వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.
ఇక ఇంట్లో కిటికీలను పశ్చిమ దిశలో కూడా పెట్టుకోవచ్చు. పశ్చిమ దిశలో కిటికీలు ఉంటే కూడా మంచిదని చెబుతున్నారు. ఒకవేళ ఇంటికి పశ్చిమాన ఖాళీ స్థలం ఉంటే కిటికీలు పెట్టకపోయినా పర్వాలేదు అని చెబుతున్నారు. కిటికీలను పొరపాటున కూడా నైరుతి దిశలో పెట్టకూడదు. నైరుతి దిశలో కిటికీ పెడితే ఆ కిటికీల నుండి వచ్చే వెలుతురు, గాలి ఆరోగ్యానికి హానికరమైనవి. కాబట్టి ఈ దశలో కిటికీలను నివారించటం మంచిదని చెబుతున్నారు.
ఇక కిటికీల ముందు ఒక వస్తువు ఉంటే ఆరోగ్యభంగం తో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతుందని చెబుతున్నారు. కిటికీల ముందు డిష్ లేదా యాంటీనాను ఉంచకూడదు. దీని ద్వారా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇంటి ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా కిటికీల ముందు డిష్ లు, యాంటీనాలు లేకుండా చూసుకోండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications