శని ఆగ్రహిస్తే తలక్రిందులుగా జీవితం: శనివారం ఈ పనులతో శనిదేవుడి అనుగ్రహం!!
జీవితంలో శని ప్రభావం అనేక ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శని మన జాతకంలో ప్రతికూలతలను కలిగించే ప్రదేశంలో ఉంటే ఆ ఫలితాలను తప్పకుండా మన అనుభవించాలి. శని రాజునైన పేదవాడిగా చేయగలిగిన శక్తి వంతమైన గ్రహం. శని ఆగ్రహిస్తే అమీర్ అయినా పకీర్ అవుతాడు.
అంతేకాదు శని సహనాన్ని, క్రమశిక్షణను నేర్పే గ్రహం. అటువంటి శని దేవుడిని జ్యోతిషశాస్త్రంలో చాలా దుష్ట గ్రహం గా పరిగణిస్తారు. ఆయన కన్ను ఎవరిపై పడితే వారు చెడ్డ రోజులు అనుభవించాల్సి వస్తుందని చెబుతారు. అటువంటి శనిదేవుని శాంతింప చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని, శని దేవుడు ప్రసన్న మైతే జీవితంలో ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

శని దేవుడు అనుగ్రహం కోసం శనివారం నాడు నల్ల దుస్తులు ధరించాలని చెబుతున్నారు. అలాగే ఆవనూనెను దానం చేస్తే మంచిదని చెబుతారు. ఆవనూనెను దానం చేసే సమయంలో అందులో ఒక నాణెం వేస్తే మంచిదని చెబుతున్నారు. శనిదేవుడి ఆగ్రహం తగ్గాలంటే ఆయన అనుగ్రహం కావాలంటే శనివారం రోజు 1.25 కిలోల నల్ల మినుములు దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
ఇక శనివారంనాడు నల్లకుక్కకు రొట్టెలను తినిపించటం కూడా శని అనుగ్రహానికి కారణం అవుతుందని చెబుతున్నారు . ప్రతి రోజూ 108 సార్లు శని దోష నివారణ మంత్రాన్ని చదివితే శని దోష నివారణ అవుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఓం శనైశ్చరాయ నమః అంటూ శని మంత్రాన్ని చదవడం వల్ల దోష నివారణ కలుగుతుందని చెబుతున్నారు.
అంతే కాదు శనిదోషంతో బాధపడుతున్న వారు శని అనుగ్రహం కోసం ప్రతి రోజూ శివుడిని పూజించాలని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయాలని చెబుతున్నారు. నల్ల ఆవును పూజించడం వల్ల కూడా శని శాంతిస్తాడని చెబుతున్నారు. ఇక శని దోషంతో బాధపడేవారు నిత్యం హనుమంతుడుని పూజించడం వల్ల కూడా శని దోష నివారణ జరుగుతుందని చెబుతున్నారు. శనివారం నాడు శనిదేవుడిని పూజించి నల్ల నువ్వులను, నల్ల వస్త్రాన్ని, ఆవనూనెను ఆయనకు సమర్పిస్తే కూడా శని అనుగ్రహిస్తాడని చెప్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications