కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి.. కనక వర్షం కురుస్తుంది!
మాసాల్లో అత్యంత పవిత్రమై మాసం కార్తీక మాసం. ఆ మాసంలో శివకేశవులను భేదం ఎంచకూండా పూజించాలి. ఎక్కడ చూసినా బ్రహ్మాండమంతా పరమాత్మే కనపడతాడు. ఆది పరాశక్తి కనపడుతుంది. చిన్న మురుగు నీటి గుంతలో కూడా పరమేశ్వరుడు, విష్ణువు ఉంటాడు. ఇంతటి ప్రఖ్యాతమైన మాసంలో పౌర్ణమి ఈనెల 5వ తేదీన వస్తోంది. ఆరోజు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిది. కోర్కెలు తీరతాయి. ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు శుభ సమయాలుంటాయి. వాటిని తెలుసుకోవాలి.
శక్తివంతమైన తిథి
కార్తీక తిథి చాలా శక్తివంతం. నవంబరు నాలుగో తేదీ రాత్రి 10.36 గంటలకు ప్రారంభమై 5వ తేదీన 6.48 గంటలకు ముగుస్తుంది. ఆరోజు సాయంత్రం వరకు పూజలు చేసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ఈరోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి, శివుడు, శ్రీహరికి అంకితమైన రోజు. అదేరోజు దేవతలు భువి నుంచి దివికి వస్తారు. గంగానదిలో స్నానం చేస్తారు.

మూడు అద్భుత యోగాలు
కార్తీక పౌర్ణమి రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం, సర్వ సిద్ధియోగం, అశ్వనీ నక్షత్ర కలయిక జరగడంవల్ల భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని పండితులు తెలియజేస్తున్నారు.5వ తేదీన ఎవరైతే శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తారో వారు అనుకున్న పనులు నెరవేరతాయి. అదేరోజు లక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో కనకవర్షం కురుస్తుంది.
ఆరోజే తులసి జన్మదినం
కార్తీక పౌర్ణమి రోజే తులసి భూమి మీద జన్మించింది. ఆరోజు తులసి మొక్కను ప్రత్యేకంగా పూజించాలి. ఉసిరికాయలో ఒత్తులు ఉంచి దీపారాధన చేయడం చాలా శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పగలు ఉపవాసం ఉండి చంద్రుడి దర్శనం తర్వాత దీపారాధన చేస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ శక్తికి అనుగుణంగా దానాలు చేయడం కూడా రెట్టింపు ఫలితాలనిస్తుంది.












Click it and Unblock the Notifications