పూజలో స్టీలు పాత్రలు వాడుతున్నారా.. శుభమా? అశుభమా? తెలుసుకోండి!!

చాలా మంది ప్రతీరోజూ పూజలు చేస్తారు. అయితే పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలని పాటించటం మాత్రమే కాక, పూజలు చేసేటప్పుడు ఎలాంటి పాత్రలను ఉపయోగించాలి? ఏ లోహంతో చేసిన పాత్రలు మంచివి ? అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హిందూ మత గ్రంథాలలో దేవత మూర్తులను పూజించటానికి అనేక నియమాలు సూచించబడ్డాయి. నియమానుసారంగా దేవతలను పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక మతపరమైన ఆచారాలలో, వివిధ పూజలలో ఉపయోగించే వస్తువుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భగవంతుని పూజించటానికి ఉపయోగించే పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంపిక చేసుకోవాలి.

Do you use steel utensils in puja? Is it auspicious? or ominous?

నిజంగా పూజలు చేసేటప్పుడు ఎటువంటి పాత్రలను ఉపయోగించాలి? ఎటువంటి మెటల్ తో తయారు చేసిన పాత్రలను ఉపయోగిస్తే మంచిది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. పూజలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు. స్టీల్ పాత్రలను పూజలకు ఉపయోగిస్తే అది అశుభ సంకేతంగా చెబుతారు. పూజలో ఇత్తడి పాత్రలను, వెండి పాత్రలను, రాగి పాత్రలను ఉపయోగించడం శుభప్రదంగా చెబుతారు.

వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి పూజలో వెండి పాత్రలను ఉపయోగించటం శ్రేయస్కరంగా చెబుతారు. ఇక వెండి పాత్రలను దేవుడి పూజలకు మాత్రమే కాదు చనిపోయిన పూర్వీకులకు తర్పణం వదలడానికి కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇక రాగి పాత్రలను దేవుళ్లను పూజించడానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైనవిగా భావిస్తున్నారు.

రాగి పాత్రలను కూడా మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. పూజలో పొరపాటున కూడా ఉక్కు పాత్రలు వాడకూడదు. స్టీల్ పాత్రలు, ఇనుప పాత్రలు ఉపయోగించటం ఏమాత్రం మంచిది కాదు. రాగి మరియు వెండి, బంగారం, ఇత్తడి పాత్రలను ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకా పంచ లోహాల పాత్రలను కూడా పూజలకు వాడుకోవచ్చు. కానీ పొరబాటున కూడా పూజలకు స్టీలు పాత్రలు వాడకండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+