త్వరలో ప్రబోధిని ఏకాదశి.. తులసి వద్ద ఈ తప్పులు చేస్తే లక్షీదేవి ఆగ్రహిస్తుంది!!
ప్రబోధిని ఏకాదశి, దేవ్ ఉథాని ఏకాదశి కార్తీక మాసంలోని శుక్లపక్షం లోని 11వ రోజున వస్తుంది. విష్ణు నిద్రించు నాలుగు నెలల చాతుర్మాస కాలం ఈరోజుతో ముగుస్తుంది. ఈ రోజున తులసికి వివాహ వేడుకను నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం విష్ణువు దేవ శయన ఏకాదశి రోజున నిద్రపోతాడు. మళ్లీ ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకే ప్రబోధిని ఏకాదశి శ్రీమహావిష్ణువు కోసం అంకితం చేయబడింది.
ఇక ప్రబోధిని ఏకాదశి నవంబర్ 23 వ తేదీన వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ప్రబోధిని ఏకాదశి రోజున తులసి కి సంబంధించిన కొన్ని విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రబోధిని ఏకాదశి రోజున తులసికి పొరపాటున కూడా నీరు సమర్పించ వద్దు మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహాలక్ష్మి రూపమైన తులసి మాత ఆరోజు విష్ణువు కోసం నిర్జల వ్రతాన్ని ఆచరిస్తుంది.

హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టు లో నివసిస్తున్నదని నమ్ముతారు. ఏకాదశి రోజున తులసి ఆకులను ఎప్పుడు తుంచకూడదు. తులసి ఆకులు ఎప్పుడు అవసరమైనా ఏకాదశి రోజు కాకుండా అంతకు ముందు రోజు మాత్రమే తెంచి పెట్టుకోవాలి. తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కకు నమస్కరించి మరీ తుంచాలి. తులసి ఆకులను గోళ్లతో గిల్లడం మహా పాపంగా పరిగణించబడుతుంది.
మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో తులసి ఆకులను ఎప్పుడు తాకకూడదు. ఒక వేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఊహించని ఆర్థిక ఇబ్బందులు కష్టాలు, కలుగుతాయి. ఎక్కడైతే నియమ నిష్టలను పాటించకుండా తులసిని తాకుతారో ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రబోధిని ఏకాదశి నాడు తులసి మొక్క ఉన్న చోట మురికి ఉండకుండా చూసుకోవాలి.
పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు, బూట్లు విప్పకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా, పరమపవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు మంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. అందుకే ప్రబోధిని ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications