దక్షిణ దిశలో ఈ వస్తువులు పెడితే వెంటనే తీసెయ్యండి.. లేదంటే సర్వనాశనం!!
వాస్తు శాస్త్రంలో దిశలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచడం ఆనందానికి, శ్రేయస్సుకు కారకంగా మారుతుంది. ఇక వాస్తు శాస్త్రంలో దక్షిణ దిశను యమ దిశగా పరిగణిస్తారు. దక్షిణ దిశను భూమి మూలకం ఆధిపత్యం చేసే దిశగా పరిగణిస్తారు. కాబట్టి దక్షిణ దిశ విషయంలో జాగ్రత్త అవసరం.
సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితం కోసం దక్షిణ దిశలో ఏమి ఉంచాలి? ఏమి ఉంచకూడదు అనే విషయాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది దక్షిణం దిశవైపు ఉన్న ఇంటిని శుభ ప్రదంగా పరిగణించరు అయితే ఇల్లు దక్షిణం దిశ వైపు ఉంటే, ఆగ్నేయదిశలో ప్రధాన ద్వారం ఉంటే బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉండవు. దక్షిణదిశ ఇల్లు కాకుండా ఉంటేనే మంచిది; కానీ ఒకవేళ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక వాస్తు ప్రకారం దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టాలి. దక్షిణం దిశలో బరువైన వస్తువులను పెట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణం దిశ విషయంలో తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త దక్షిణం వైపు పొరపాటున కూడా కాళ్లు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే ఆరోగ్య హాని కలుగుతుంది. ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచినట్లయితే అది సానుకూలతలను ఆకర్షిస్తుంది.
వాస్తు ప్రకారం దక్షిణం దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దక్షిణ దిశ పూర్వీకుల కోసం కేటాయించిన దిశ కావడంతో ఈ దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం మంచిది. దక్షిణం వైపు యంత్రాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచడం మంచిది కాదు. దక్షిణ దిశలో బూట్లు, చెప్పులు పెట్టడం వల్ల పితృ దోషం తలెత్తుతుంది.
పితృ దోషం కలిగితే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. పూజ స్థలాన్ని మరియు వంటగదిని దక్షిణ దిశలో పొరపాటున కూడా నిర్మించకూడదు. ఇక దక్షిణ దిశ విషయంలో ఈ నియమాలను పాటిస్తే ఆర్థిక నష్టాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతాము.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications