dreams astrology: కలలో మాంసం.. మంచిదా? చెడు జరుగుతుందా? తెలుసుకోండి!!
ప్రతి వ్యక్తి నిద్రలో రకరకాలుగా కలలను కంటూ ఉంటారు. ఇక కలలకు సంబంధించి అనేక అధ్యయనాలు ఉన్నాయి. కలలకు మానవ జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుందని అంటున్నారు. చాలా సందర్భాలలో మనకు కలలలో జరిగిన వివిధ సంఘటనలు మన జీవితంలోని అనేక భవిష్యత్తు సంఘటనలకు సూచనగా ఉంటాయి.
అందుకే కలలో కనిపించే ప్రతి విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్తారు. కలలో వచ్చిన వివిధ విషయాలపై కాస్త శ్రద్ధ అవసరమే అని అంటున్నారు. చాలామందికి కలలో మాంసం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కలలో మాంసం కనిపిస్తే మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఎలా కనిపిస్తే మంచి జరుగుతుంది వంటి వివరాలను స్వప్న శాస్త్రం లో చాలా చక్కగా వివరించారు.

స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరికైనా కలలో మాంసాన్ని చూడడం అంటే అది వచ్చిన సందర్భాన్ని బట్టి, వచ్చిన పొజిషన్ ను బట్టి అదృష్టాన్ని, దురదృష్టాన్ని కలిగిస్తుంది. వండిన మాంసాన్ని కలలో చూస్తే అదృష్టం అని చెబుతున్నారు. ఇలా వండిన మాంసం కలలోకి వస్తే త్వరలో ఏదైనా పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు.
ఇక పచ్చి మాంసాన్ని కలలో చూడడం అశుభంగా పరిగణిస్తారని చెబుతున్నారు. పచ్చి మాంసం కలలోకి వస్తే మీ జీవితంలో ఏదైనా చెడు జరగబోతుంది అన్న సంకేతంగా చెబుతున్నారు. ఇక కలలో ఎప్పుడో వండిన మాంసాన్ని తిన్నట్టుగా వస్తే కొన్ని చెడు జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతాయి అని అర్థం గా చెబుతున్నారు. అప్పుడే మాంసాన్ని వండుకొని తిన్నట్టుగా వస్తే మంచి జరుగుతుందని, జీవితంలో భవిష్యత్తులో ఏదైనా పురోగతి కనిపిస్తుందని చెబుతున్నారు.
అంతేకాదు కలలో మాంసాన్ని కోసినట్లుగా చూస్తే మీరు మరో వ్యక్తితో ఏదైనా విలువైన ఆస్తులను పంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కుళ్ళిన మాంసం కలలో వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. కోడి మాంసం తిన్నట్టు కలొస్తే మహిళలు శుభ వార్తలు వింటారని అంటున్నారు. ఏది ఏమైనా కలలో మాంసం వస్తే అది వచ్చిన దాని బట్టి ఫలితం ఉంటుందని అంటున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications