పుష్యమిలో బుధుడు... ఈ రాశులకు అఖండ ధనయోగం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని శుభాలు, మరికొన్ని అశుభాలను కలిగిస్తుంటాయి. ఈ నెల 25వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటోంది. ఈ నక్షత్రానికి అధిపతి శని. బృహస్పతి, చంద్రుడి ప్రభావం కూడా పుష్యమి నక్షత్రంపై ఉంటుంది. ఏ రాశులకు బుధుడు శుభ ఫలితాలను అందించనున్నాడు? వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యా రాశి
వ్యక్తిగత జీవితంతోపాటు ఉద్యోగ జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. దాంపత్య జీవితం మాత్రం చాలా మధురంగా సాగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంకా ఈ రాశివారికి అనేక లాభాలు కలుగుతాయి.

మకర రాశి
జీవిత భాగస్వామి నుంచి మద్దతు చాలా అవసరం. అదృష్టం కలిసి వచ్చే సమయం కూడా ఇదే. అనుకున్న పనులను చాలా విజయవంతంగా పూర్తిచేస్తారు. సీనియర్ల నుంచి కార్యాలయాల్లో మద్దతు దొరుకుతుంది. ఆర్థిక లాభాలున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
వృషభ రాశి
ఈ రాశివారు ఎంతో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెడితే బాగా కలిసివస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంది. నిర్ణయాలన్నీ చాలా మంచివి తీసుకుంటారు. పాజిటివ్ గా ఆలోచిస్తారు. ప్రశాంతకరమైన జీవితాన్ని కోరుకుంటారు. ఆ విధంగానే వారు జీవిస్తారు.
కర్కాటక రాశి
విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రాశివారికి ఇది మంచి సమయం. విద్యార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమవడానికి ఈ సమయం కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టేవారికి అనేక ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది.
తులా రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. కెరీర్ పరంగా విజయాలను అందుకుంటారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. మీడియాతోపాటు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు ఈ సమయంలో మంచి విజయాలు సాధిస్తారు.












Click it and Unblock the Notifications