తలరాత ప్రకారం మీ జాతకం ఇలా ఉంటుంది
ప్రస్తుతం ప్రపంచమంతా రకరకాల వైరస్ లు, యుద్ధాలు రాజ్యమేలుతున్నాయి. ఒకరకంగా ఇది మంచికాలం అవదు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం తలరాతకు, భవిష్యత్తుకు సంబంధం ఉందంటారు. తలరాత తెలుసుకోవాలంటే అద్దంలో తలను చూసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే అప్రమత్తం అవ్వొచ్చంటున్నారు.
నుదుటిపై గుండ్రంగా గీత ఉంటే సంపద కోల్పోతారని అర్థం. నుదుటిపై 5 లేదంటే 6 లేదంటే 7 గీతలుంటే అటువంటివారు 50 సంవత్సరాలు బతుకుతారంట. నుదుటిపై ఉండే గీత తలపై ఉండే జుట్టులోకి వెళితే ఆ తరహా వ్యక్తులు 60 సంవత్సరాలు జీవిస్తారు.

తలపై ఒకటే గీత ఉంటే 20 సంవత్సరాలు, 3గీతలుంటే 40 సంవత్సరాలు, నుదుటి మధ్య నుంచి మొదలై రెండేసి లైన్లు చెరోవైపుకు వెళుతుంటే అటువంటివారు ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తారు. నుదుటిపై భారీ లైన్లు రెండు ఉంటే వారు 70 సంవత్సరాల ఆయుష్షును కలిగివుంటారు. మూడు పెద్ద గీతలుంటే 60 ఏళ్లు బతుకుతారు. కొన్ని గీతలు స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా ఉంటే ఆ తరహా వ్యక్తులు 40 ఏళ్లు జీవిస్తారు.
నుదుటిపై ఒక్క గీత కూడా వారి ఆయుష్షు 40 ఏళ్లు ఉంటుంది. నుదుటిపై గీత ముక్కలైనట్లుగా ఉంటే మరణం వస్తుందని చెబుతున్నారు. నుదుటి మధ్య భాగం నుంచి కుడివైపుకు 3 లేదా 4 పగిలిపోని గీతలు ఉంటే... అలాంటి వారు రాజు లేదా అధినేతలు అవుతారని, ఆల్చిప్పలా లైన్ ఉండి... అది పెద్దది అవుతూ ఉంటే... అలాంటి వారు ప్రొఫెసర్ అవుతారని శాస్త్రం చెబుతోంది. నుదుటిపై త్రిశూలం ఆకారంలో గీతలు ఉంటే... అలాంటి వారు సంపన్నులు అవుతారు. వీటికి సైంటిఫిక్ ఆధారాలు లేకపోయినా చాలావరకు నమ్ముతారు.వ












Click it and Unblock the Notifications