మరికొద్ది గంటల్లో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది!!

సంపదలకు మరియు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే 30 వ తేదీన కర్కాటకంలో సంచరించనున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుని సంచారం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది. వారి ఆదాయం విపరీతంగా పెరగడంతో పాటు, ఉద్యోగ వ్యాపారాలలోను ఊహించని విధంగా పురోగతి కలుగుతుంది.

శుక్రుడు కర్కాటకంలో కి ప్రవేశించేది అప్పుడే:జేష్ఠమాసంలో శుక్లపక్ష దశమి తిథినాడు మే 30 వ తేదీన రాత్రి 07:51 నిమిషాలకు శుక్రుడు రాశిని మారుస్తున్నాడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అతని జీవితంలో దేనికి లోటు ఉండదు. ప్రస్తుతం మిధున రాశిలో ఉన్న శుక్రుడు మే 30వ తేదీన చంద్రుని రాశి అయిన కర్కాటకంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశిచక్ర జాతకాలకు శుభఫలితాలు కలుగుతున్నాయి.

Fortune will be knocking the door of these zodiac signs in a few hours!

4 రాశుల వారు పట్టిందల్లా బంగారమే:మే 30 వ తేది మొదలు నాలుగు రాశుల వారికి జూలై 7వ తేదీ వరకు పట్టిందల్లా బంగారం అవుతుంది. శుక్రుడు కర్కాటక రాశి లో సంచరించడం వల్ల మిధున రాశి, మేష రాశి, మీన రాశి, వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రాశులకు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడమే కాకుండా, వ్యాపారంలో పురోగతి, సమాజంలో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.

మిధున రాశి:కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల మిధున రాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మిధున రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. మిధున రాశి జాతకుల ఆర్థికస్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల ఉంటాయి.

మేష రాశి:
కర్కాటక రాశిలో శుక్ర గ్రహ సంచారం వల్ల మేష రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది. వారి కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరుప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు.

మీన రాశి:మీన రాశి జాతకులకు శుక్రుడు కర్కాటక రాశి లోకి మారడం వల్ల వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీన రాశి జాతకులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఇక ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి, మార్పులు జరగడానికి అవకాశం ఉంది.

వృశ్చిక రాశి :వృశ్చిక రాశి జాతకులకు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ధన లాభం కలుగుతుంది. అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది. ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+