Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగు శక్తివంతమైన రాజయోగాలతో నేడే సూర్యగ్రహణం.. వీరికి సంపదల వర్షం!

17 ఫిబ్రవరి 2026న అమావాస్య.. నేడు తొలి సూర్యగ్రహణం జరుగనుంది. ఇది వలయాకార సూర్యగ్రహణం గా భావించబడుతుంది, ఇది "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రభావాన్ని చూపిస్తుంది.సూర్యగ్రహణం మన భారత దేశంలో కనిపించదు. ఇది అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా భాగాలలో కనిపిస్తుంది. దీని తర్వాత 2026 ఆగస్టు 12న మళ్ళీ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా పాటించే సూతక కాలం కూడా పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

సూర్య గ్రహణ సమయంలో నాలుగు శక్తివంతమైన రాజయోగాలు

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ సూర్యగ్రహణ సమయంలో నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. బుధాదిత్య రాజయోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, కుజ చంద్రుల యుతి ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల జీవితం మీద అనుకూల ప్రభావాలు చూపుతాయని భావిస్తున్నారు. ఈ ప్రభావాలు ముఖ్యంగా ఆర్థిక పురోగతి, సంబంధాల్లో బలోపేతం, ఉద్యోగ-వ్యవసాయ రంగాల్లో సానుకూల మార్పులు వంటి ఫలితాలుగా కనిపించే అవకాశం ఉంది.

Four powerful Raja Yogas during the solar eclipse Wealth and happiness for these zodiac signs

మేష రాశి

సూర్య గ్రహణం నాడు ఏర్పడే విశేష రాజయోగాల కారణంగా మేషరాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రాపర్టీ కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి జాక్ పాట్ ఇస్తుంది.

వృషభ రాశి

సూర్య గ్రహణం నాడు ఏర్పడే నాలుగు విశేష రాజయోగాల కారణంగా పెట్టుబడుల్లో లాభాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది . వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి కలిసి వస్తుంది.

సింహ రాశి

సూర్య గ్రహణం నాడు ఏర్పడే నాలుగు విశేష రాజయోగాల కారణంగా ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి సూర్య గ్రహణం నుండి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి

సూర్య గ్రహణం నాడు ఏర్పడే నాలుగు విశేష రాజయోగాల కారణంగా కెరీర్‌లో వృద్ధి జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏం చేసినా అన్ని విషయాలలో లబ్ది జరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+