ఈ నెల 20 నుంచి ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది.. మహర్జాతకులవుతున్నారు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఈనెల 20వ తేదీన రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. సెప్టెంబరు 21వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. రాహువును చాలామంది పాప గ్రహంగా పరిగణిస్తారుకానీ నక్షత్ర సంచారం వల్ల నాలుగు రాశులకు భారీ అదృష్టాన్ని తీసుకురానున్నాడు. జీవితంలోని ప్రతి రంగంలో అభివృద్ధి చెందేలా చేస్తాడు. ఏయే రాశులవారు రాహువు వల్ల తమ తలరాతను మార్చుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు రాహువును సాయం అర్థించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి రాహువును పూజిస్తే అనుకున్న పని తీరుతుంది. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోను విజయాన్ని అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమయం ఇది. కోర్టు కేసుల నుంచి బయటపడతారు.

కుంభ రాశి
గతంలో ఇక రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ప్రేమలో ఉన్నవారి మధ్య సంబంధాలు బలపడతాయి. స్థిరంగా ఉంటాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న పనులన్నింటినీ గడువులోగా పూర్తిచేసుకుంటారు. ఆధ్యాత్మిక వాతావరణంపట్ల మొగ్గు చూపి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మేష రాశి
కొన్నాళ్లుగా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటున్న కల ఇప్పుడు నెరవేరుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఈ సమయంలోనే బయట పడతారు. కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభించడంతోపాటు సమస్యలన్నీ తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. అన్నీ సానుకూల ప్రయోజనాలే కలుగుతాయి. కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. బాగా కలిసివస్తుంది.
సింహ రాశి
వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. ఆస్తికి సంబంధించి తల్లిదండ్రుల వైపు నుంచికానీ, భార్యవైపు నుంచికానీ కలిసివచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా తలుపుతడతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications