నిన్నటి నుంచే ఈ రాశులకు అఖండ ధన యోగం
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 14వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి రాశిని మార్చుకొని, 12 నెలలకు 1 రాశుల్లో ప్రయాణం చేస్తాడు. ఈ రాశికి కుజుడు అధిపతి. సూర్య భగవానుడు, కుజుడు అన్యోన్యంగా ఉండటంవల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశులు మాత్రం ప్రత్యేకంగా ప్రభావితమవుతాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి
కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. కోపాన్ని నియంత్రించుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. శివాలయంలోకానీ, ఇతర ఆలయాల్లోకానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని ఆరాధించాలి. సూర్యభగవానుడి స్తోత్రం చదవాలి.

తులా రాశి
జీవితంలో వీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. జీవితంలో ఇంతవరకు వారు చూడని ధనాన్ని పొందుతారు. కొన్ని విషయాల్లో ఎంతో ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాటివల్ల మంచి లాభమే కలుగుతుంది.
సింహ రాశి
ఈ సమయం ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు కలిసివస్తాయి. ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా తెలివిగా ఆలోచించి ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకుంటారు. ఈ అలవాటువల్ల జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారు. ఎదుటివారు చెప్పేది సావధానంగా విన్న తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకుంటారు. ఇది కూడా మీకు బాగా కలిసివస్తోంది.
కుంభ రాశి
దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనిని మొదలుపెట్టడంవల్ల ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు బాగుంది. కుంభరాశివారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. మొదటి నుంచి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా ఆలస్యం చేస్తారు. ఇప్పుడు మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి.












Click it and Unblock the Notifications