డిసెంబర్ 7నుండి వీళ్ళకు పట్టిందల్లా బంగారం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక విశేషం ఉంది. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. అయితే 9 గ్రహాలలో శని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. డిసెంబర్ మాసంలో శని దేవుడు బుధుడితో కలిసి నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
బుధ, శని గ్రహాలతో నవ పంచమ రాజయోగం
డిసెంబర్ 7వ తేదీన బుధుడు మరియు శని ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉంటారు. ఇది నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి శని మరియు బుధుల కారణంగా ఏర్పడిన నవ పంచమ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. మిధున రాశిలో శని పదవ ఇంట్లో, బుధుడు 9వ ఇంట్లో ఉంటాడు. పర్యవసానంగా ఈ రాశిలో జన్మించిన వారికి డిసెంబర్ నెల కలిసి వస్తుంది. కెరీర్లో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. చేపట్టే ప్రాజెక్టులు ప్రశంసలను పొందుతాయి. ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
కన్యారాశి
బుధుడు మరియు శని యొక్క నవ పంచమ రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. కన్యరాశిలో బుధుడు రెండవ ఇంట్లో, శని ఏడవ ఇంట్లో ఉంటాడు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కన్యారాశి జాతకులకు కలిసివస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కాకుండా ఎదురుచూస్తున్న వారికి పెళ్లి యోగం ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి ప్రయోజనాలు కలుగుతాయి.
మీన రాశి
బుధుడు మరియు శని యొక్క నవ పంచమ రాజయోగం మీనరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు అదృష్టాన్ని చూస్తారు. మీనరాశిలో లగ్న గృహంలో శని, ఎనిమిదవ ఇంట్లో బుధుడు ఉండడంవల్ల బుధ, శని కలయిక వీరికి లాభదాయకంగా మారుతుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఉన్న నిరాశ, అలసట, విచారం వంటివి పోతాయి. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి.ఇది కన్యారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
Todays Horoscope:ఈ రాశి వారికి ధన యోగం..రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే..? -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్











Click it and Unblock the Notifications