జూన్ 15 నుండి ఈ రాశులవారి జీవితం ప్రకాశిస్తుంది
వేద జ్యోతిషశాస్త్రంలో జూన్ 15 తర్వాత గ్రహాల గమనం కారణంగా వివిధ వివిధ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. వారి దశ మారుతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మిధున రాశిలో ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగము ఏర్పడుతుంది. జూన్ 15వ తేదీన త్రిగ్రాహి యోగం మిధున రాశిలో ఏర్పడుతుంది. ఇది ఒక శుభయోగం. దీని ప్రభావంతో అనేక రాశుల వారి జాతకాలు మారనున్నాయి.
జూన్ 15 వరకు పెద్ద గ్రహాల గమనం .. మిదునరాశిలో త్రిగ్రాహి యోగం
జూన్ 12వ తేదీన శుక్రవారం మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 14వ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆపై జూన్ 15వ తేదీన మిధున రాశిలోకి సూర్యుని ప్రవేశం జరుగుతుంది. ఇక అప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో అదృష్టాన్ని పొందే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశిలో త్రిగ్రాహి యోగం కారణంగా మిధునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు కనిపిస్తాయి. వృత్తి జీవితంలో కూడా కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ నెలలో ఏ పని చేసిన మీకు విజయం వరిస్తుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా ఇది సరైన సమయం.
కన్యారాశి
మిధున రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వలన వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. కన్యారాశి జాతకులు ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు.
తులా రాశి
మిధున రాశిలో ఏర్పడుతున్న త్రిగ్రాహి యోగం కారణంగా తులా రాశి జాతకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్ లకు అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications