మే 10 నుంచి ఈ రాశులవారి సుడి తిరగనుంది

గ్రహాలకు కమాండరైన అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. మే 10వ తేదీ వరకు అదే రాశిలో ఉంటాడు. తర్వాత కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధైర్యాన్నిచ్చే మార్స్ గ్రహం రాశి మారుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశిలో అంగారకుడు తిరగడంవల్ల ఏ రాశివారికి ప్రయోజనంగా ఉంటుందో తెలుసుకుందాం.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా లాభపడటం జరుగుతుంది. ఆదాయం పెరగడంతోపాటు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి.

zodiac signs

మీన రాశి : అంగారకుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కెరీర్ శరవేగంతో ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తికావడంతోపాటు కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీదగ్గరకు వస్తుంది.

కుంభ రాశి : కుజుడు రాశి మార్చడం కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ కష్టానికి తగినట్లుగా ప్రశంసలు దక్కుతాయి. శత్రువులపై విజయం సాధించడంతోపాటు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరత్వరగా పూర్తవుతాయి. ఇదే సమయంలో డబ్బును పొదుపు చేస్తారు.

కన్యా రాశి :
అంగారకుడి సంచారం కన్యా రాశి వారికి లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతోపాటు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులకు కూడా మంచి సమయం కేటాయిస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+