నేటినుండి వీరు మట్టి పట్టుకున్నా బంగారమే.. దీవించిన దశాంక యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాలానుగుణంగా సంచారం చేసే గ్రహాలు అనేక రాజ యోగాలను సృష్టిస్తూ తమ గమనాన్ని సాగిస్తాయి. ఇక సెప్టెంబర్ 28వ తేదీన రాత్రి శుక్రుడు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడితో సంయోగం చెంది శక్తివంతమైన దశాంక యోగాన్ని ఏర్పరిచారు.
దంశాంక యోగం.. అదృష్ట రాశులు
ఈ రెండు గ్రహాలు రాశి చక్రంలో 36 డిగ్రీల కోణీయ స్థితిలో ఉన్నప్పుడు దశాంక యోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన దశాంక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరికి ఊహించని లాభాలు, ఆకస్మిక ధన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కన్యారాశి
దశాంక యోగం కన్యారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి కాలం. ఉద్యోగస్తులకు పదోన్నతులు , ఇంక్రిమెంట్లు వస్తాయి. వివాహితులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.
సింహరాశి
దశాంక యోగం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక సమస్యలు ఉండవు. వివాహితులు ప్రేమ జీవితంలో ప్రయోజనాలను పొందుతారు. సింహరాశి వారి ప్రణాళికలు ఈ సమయంలో అన్ని విజయవంతమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
వృశ్చిక రాశి
దశాంక యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. విదేశీయానం చేయడానికి వీలుంటుంది.












Click it and Unblock the Notifications