జనవరి నుండి గజకేసరి రాజయోగంతో వీరే లక్కీఫెలోస్!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేవతల గురువు అయిన బృహస్పతి మనసుకు కారకుడైన చంద్రుడితో 2026 సంవత్సరంలో సంయోగం చెందబోతున్నాడు. బృహస్పతి చంద్రుల సంయోగంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

గజకేసరి రాజయోగం
జనవరి 2న ఉదయం 9.25 నిమిషాలకు చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 4న 9.42 నిమిషాల వరకు అక్కడే ఉంటాడు. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం అన్ని రాశులవారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గజకేసరి రాజయోగం కలిసొస్తుంది.

gajakesari rajyoga 2026 lucky zodiac signs with jupiter and moon conjunction

వృషభరాశి
గజకేసరి రాజయోగం వృషభరాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో రెండవఇంట్లో బృహస్పతి మరియు చంద్రుల కలయిక జరుగుతుంది. ఇది శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ రాజయోగం వృషభరాశిలో జన్మించిన వారిపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్యాలు తగ్గుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసివస్తుంది. ఉద్యోగులకు లాభాలు వస్తాయి. ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇస్తారు.

మిధున రాశి
గజకేసరి రాజయోగం మిధునరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిధునరాశి జాతకులు ఈ సమయంలో అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. అన్ని విధాల ఇది మిధున రాశి జాతకులు అభివృద్ధి చెందడానికి మంచి సమయం.

తులారాశి
గజకేసరి రాజయోగం తులారాశి జాతకులను అదృష్టవంతులుగా మారుస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో కొత్త కెరీర్ అవకాశాలను చూస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సామాజికంగా గుర్తింపు వస్తుంది. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసిన మంచి విజయాలను చేకూరుస్తుంది. ఇది తులా రాశి వారి కెరీర్ పురోగతికి దోహదం చేస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+